- మైరాన్ చెరుబిక్ వెంచర్ పై అధికారుల ఉదాసీనత
- అక్రమమని తేలినా చర్యలకు వెనుకాడుతున్న వైనం
- బఫర్ జోన్‌లో నిర్మాణాలను కూల్చేసిన ఇరిగేషన్ ఆఫీసర్లు
- మొద్దు నిద్ర వీడని పంచాయతీ రాజ్ అధికారులు
మైరాన్ వెంచర్ పై పంచాయతీ రాజ్ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు . ఎలాంటి పర్మిషన్ లేకుండా వెంచర్ వేసినా.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా షాబాద్ మండల్లోని తిమ్మరెడ్డి గూడ గ్రామంలో అక్రమంగా వేసిన వెంచర్‌పై ఆదాబ్ హైదరాబాద్ మైరాన్ మాయ అనే శీర్షకతో స్టోరీ ప్రచూరించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు మాత్రమే లింగా రెడ్డి చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చవేశారు. పంచాయతీ రాజ్ ఎలాంటి సంబందం లేటన్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమమని తేలినా… చర్యలకు వెనుకాడడంపై విమర్శలు వస్తున్నాయి.

పంచాయతీ రాజ్ అధికారుల బాధ్యతా రాహిత్యం
మైరాన్ చెరుబిక్ వెంచర్ ఏర్పాటు కావడంలో పంచాయతీ రాజ్ అధికారులే సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు సార్లు నోటీసులు ఇవ్వడం మినహా… అందులో భారీ రోడ్లు వేసినా… కాంపౌండ్ వాల్ కట్టినా… బిల్డింగులు, ఫాం హౌస్‌లు నిర్మించినా పట్టించుకోవడం లేదు. వెంచర్ పై ఆదాబ్ హైదరాబాద్‌లో కథనం ప్రచురితం అయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు స్పందించారు. డీఈఈ రమణ గుడ్డికన్న మెల్ల నయమనట్లు లింగారెడ్డి చెరువులో 20 మీటర్ల మేర బఫర్ జోన్ గుర్తించి… అందులో కట్టిన ప్రహరీ గోడను జేసీబీల సాయంతో తొలగించారు. మిగితాది కూడా పరిశీలిస్తున్నామని, ఇరిగేషన్ ఎక్కడి వరకు ఉన్నా స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. అదే పంచాయతీ రాజ్ అధికారులు మాత్రం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వివరణ కోరినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. తమ పదవి కాలంలో వెంచర్ ఏర్పాటు చేయలేదని దాట వేస్తున్నారు. దీన్ని బట్టే వాళ్లకు ఉన్న లోపకాయిరీ ఒప్పందం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మేం చేసేది చేస్తాం
మేం చేసేది.. చేస్తాం.. మీరు చేసేది మీరు చేయండి. నేను ఇక్కడికి రాకముందే ఆ వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్ వాళ్లకు ఇది వరకే నోటీసులు ఇచ్చాం. మరో సారి పరిశీలన చేసి పై అధికారులకు రిపోర్టు ఇస్తాం.
- షాబాద్ ఎంపీవో శ్రీనివాస్