- ముందే తెలిసి వరుస ట్వీట్లు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్
- నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత గులాబీ పార్టీలో టెన్షన్
- రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు పేరు
- నరేందర్ రెడ్డి వాంగ్మూలంతో రంగంలోకి దిగిన పోలీసులు
- దాడికి ముందు సురేశ్, పట్నం, కేటీఆర్ మధ్య వరుస కాల్స్
- కాల్ డేటా లీక్‌తో కేటీఆర్ గుండెల్లో వణుకు
తెలంగాణలో పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇటీవల జరిగిన కలెక్టర్, ఉన్నతాధికారుల దాడి కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రైతుల పేరిట బీఆర్ఎస్ గూండాలు అధికారులపైన దాడికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే కేసులో బుధవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా నెక్ట్స్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు ఈ కేసులోనే అరెస్ట్ అవుతారని, మరోవైపు ఈ-ఫార్ములా రేస్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదీలా ఉండగా కేటీఆర్ కూడా ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఆయన వరుస ట్వీట్ లు చేస్తుండడం గమనార్హం. తనపై రేవంత్ కుట్ర పన్నాడంటూ నోటికొచ్చినట్టు మాట్లాడడం చూస్తే అరెస్ట్ ఖాయమనే లీకులు ఆయన వచ్చినట్లు జోరుగా ప్రచారం అవుతుంది. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా మాటల తూటాలు పేలుతున్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన మొదలైన నాటి నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత సర్కారు హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరా తీస్తూ కల్వకుంట్ల ఫ్యామిలీయే టార్గెట్ గా విచారణలు చేపడ్తుంది. సడెన్ గా వికారాబాద్ జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూసేకరణ విషయంలో గ్రామస్థులు కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులుపైనా చేయి చేసుకోవడం అదీ చినికి చినికి గాలివానలా మారింది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అధిష్టానమే అని తెలుస్తోంది. కేటీఆర్ డైరెక్టన్ లో పట్నం నరేందర్ రెడ్డి లోకల్ వ్యక్తులను ఉసిగొల్పి ఈ ఘాతుకానికి పాల్పడ్డ విశ్వసనీయ సమాచారం.
రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు..అరెస్ట్ తప్పదా.? :
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా.. రాజకీయంగా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో పక్కా ప్లాన్ వేసి దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వెల్లడించారు. కలెక్టర్ సహా అధికారులపై దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అయితే ఇప్పుడిది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. లగచర్లలో ఉన్నతాధికారులపై దాడికి పాల్పడ్డ బోగమోని సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 84 సార్లు ఫోన్లో మాట్లాడటం, అదే విధంగా పట్నం నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్‌తో వరుసగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సురేశ్ తమ పార్టీకి చెందిన వాడే అయినప్పటికి అతని భూమి పోతున్నందున నిలదీయడం తప్పేంటి అంటూ ఆయనకు సపోర్ట్ గా మాట్లాడడం గమనార్హం. విచారణ జరుపుతున్న అధికారులు దాడి వెనుక ఉన్న కుట్ర కోణంలో పక్కాగా ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. కాగా దాడి కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
కేటీఆర్ ఇంటి ముందు హైడ్రామా :
రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రాజకీయ వేడి రాజుకోగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. గత వారమే ఆయన ఈ ఫార్ములా రేస్ కేసులో అరెస్ట్ కాబోతున్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో విషయం ముందే తెలిసి కేటీఆర్ మలేషియా పారిపోతున్నాడు అంటూ టీవీ ఛానళ్లు కోడై కూశాయి. కానీ అలాంటిదేమి జరగలేదు. వాస్తవంగా గత కొద్ది రోజులుగా కేటీఆర్ మాత్రం అరెస్ట్ అనే మాటను వరుసగా పలుకుతున్నాడు. నాపై కుట్ర జరుగుతుంది. నన్ను ఏదో ఓ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే వరకు నిద్ర పోడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తనను జైళ్లో పెడితే యోగా చేసి ట్రిమ్ గా అయి వచ్చి పాదయాత్ర చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితం లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి కేసులో కేటీఆర్ హస్తం ఉందని ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇంటి వద్ద రెండ్రోజులుగా హైడ్రామా నెలకొంది. బుధవారం రాత్రే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేయబోతున్నారనే ప్రచారంతో హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ నివాసానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నిన్న ఉదయం కేటీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రస్టేషన్ లో కేటీఆర్ వరుస ట్వీట్లు :
కేటీఆర్ అరెస్ట్.. కేటీఆర్ జైలుకే..అనే ప్రచారం ఊపందుకున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అసలు రూపం బయటపడింది. ప్రస్టేషన్ లో పడ్డ కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రెండ్రోజులుగా వరుస ట్వీట్లు చేస్తూ అసహనాన్ని వెలిబుచ్చుతున్నాడు. నన్ను అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు.. “ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలను కోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో… రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!.. అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ కేటీఆర్ వరుస ట్వీట్లు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.