- ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా
మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ మాజీ సీఎం జగన్ కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని తెలిపారు. అప్పుడు జరిగిన అన్ని ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదానీ దేశంలోని కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చారని వారిలో ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఉన్నారని అన్నారు. 2021లో అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ముడుపులు ముట్టాయని విమర్శించారు. లంచాల కోసం జగన్ ఏపీని సొంత జాగీరుల వాడుకున్నారని మండిపడ్డారు. ఒక్కో ఒప్పందానికి జగన్ ఎంత లంచం తీసుకున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.
పవర్ సప్లై విషయంలో ఆదానీ జగన్ కు రూ.1750 కోట్ల రూపాయిలు లంచం ఇచ్చారు..ఈ విషయం అమెరికా బయటపెట్టేంత వరకు ఎందుకు బహిర్గతం కాలేదని షర్మిలా ప్రశ్నించారు. ఈ అవినీతి కేసుతో ఆదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని వ్యాఖ్యనించారు.