Wednesday, March 19, 2025
spot_img

మోకాళ్ళపై అర్ధనగ్న ప్రదర్శన

Must Read
  • ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి
  • మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ
  • 9 రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష
  • ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ అన్నారు. షాద్ నగర్ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ఎస్సీ వర్గీకరణ కోసం నాగభూషణం మాదిగ ఆద్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలకు బొబ్బిలి పాండు మాదిగ అధ్యక్షతన‌ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అద్యక్షులు పెంట నోళ్ళ నరసింహ మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ జరిగితే మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ రిజర్వుడ్‌ కేటగిరిలోని ఉద్యోగాలన్ని ఏక పక్షంగా మాలలకే చెందే అవకాశం ఉందని అన్నారు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఉన్న న్యాయాన్ని సుప్రీం కోర్టు గుర్తించి తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు తగిన న్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేయడం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత అని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై ఏళ్లుగా శాంతియుతంగా నడుస్తున్న పోరాటం ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అని ప్రస్తుతం ఈ పోరాటం విజయానికి చేరువైందని అన్నారు. మంద కృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లేదని అన్నారు. కనుక ఎస్సీ వర్గీకరణ ఫలితం మంద కృష్ణ మాదిగకే చెందుతుందని అన్నారు.

కేవలం మాదిగల కోసమే కాకుండా అన్ని ఎస్సీ కులాలకు న్యాయం జరిగాలనే వర్గీకరణ పోరాటం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెంటనోళ్ళ నరసింహ మాదిగ, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కళ్లేపల్లి బాలరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ ఫరూక్ నగర్ మండల మాజీ అధ్యక్షుడు బొబ్బిలి పాండు మాదిగ, ఎమ్మార్పీఎస్ తాలుక నాయకులు నాగభూషణం మాదిగ, ఎమ్మార్పీఎస్ ఫరూక్ నగర్ మండల ఇంచార్జీ ఎర్రోళ్ల సురేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ తాలుక నాయకులు నార్కుంట మహేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సినియర్ నాయకులూ సంగెం శ్రీనివాస మాదిగ, ఎమ్మార్పీఎస్ దుసకల్ గ్రామ అధ్యక్షులు కర్రోల్ల శివ శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు విఠ్యాల యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీరంగపూరం చందు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లంపల్లి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు అగిరాల హరీష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు జోగు శ్రీశైలం మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు చెవిటొల్ల కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కాకునూర్ డోల రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Latest News

కాంగ్రెస్‌ అసమర్థతతో రైతులకు ఇబ్బందులు

రేవంత్‌ కళ్లు తెపిరిపించేందుకు ఎండిపోయిన వరితో వచ్చాం : కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ కాక,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS