అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాకి హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల కంటే తుపాకీల కారణంగా చనిపోతున్న చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. తుపాకి హింసను అరికట్టడానికి కృషి చేస్తున్నమని పేర్కొన్నారు.