- విధి విధానాలను ఉల్లంఘించిన సభ్యుల తొలగింపు
- అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులు
- మాజీ సెక్రెటరీ టి. హనుమంత రావు, సభ్యుడు జ్యోతి ప్రసాద్ ల డిస్మిస్
- మర్చి 23 న సొసైటీ కమ్యూనిటీ హాల్ లో సర్వసభ్య సమావేశం
- సభ్యులందరి ఆమోదంతో నిర్ణయం తీసుకున్న ప్రెసిడెంట్
- ఎలాంటి అవినీతిని ప్రోత్సహించబోమన్న రవీంద్రనాథ్
- 4 ఏళ్ళు పూర్తి చేసుకుని 5 ఏట ప్రవేశించిన సొసైటీ
- ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ కు అభినందనల వెల్లువ
అదొక ప్రిస్టీజియస్ సొసైటీ.. నగరంలో పేరుగాంచిన జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్.. ఇలాంటి సొసైటీకి గడచిన నాలుగు సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గా ప్రిస్టీజియస్ బాధ్యతలు చేపట్టి, ఎంతో హుందాగా ఎలాంటి బేధభావాలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యంగా సొసైటీని నడిపించడం కేవలం సొసైటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్ వల్లనే సాధ్యం అయ్యింది.. ఒక పేరున్న టీవీ ఛానల్ కి ఎండీగా గురుతర బాధ్యతలు నిర్వహిస్తూనే.. హౌస్ బిల్డింగ్ సొసైటీలో సైతం తనవంతు పాత్రను నిర్వహిస్తున్నారు.. 5 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు సర్వదా ఆమోదం పొందడమేకాకుండా , అభినందనలు సైతం అందుకోవడం విశేషం..
నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకున్న జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ 5వ సంవత్సరంలోకి అడిగిన సందర్భంగా.. మార్చి 23 న సొసైటీ కమ్యూనిటీ హాల్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

ఈ సర్వసభ్యసమావేశంలో సొసైటీ మాజీ సెక్రెటరీ టీ హనుమంతరావు, సభ్యుడు జ్యోతి ప్రసాద్ ల హయాంలో కొన్ని నిర్ణయాలకు సంబందిత రికార్డులు అందజేయక పోవడం, పలు ఇతర ఆరోపణలు అంటే విధానాలను ఉల్లంఘిస్తూ, పలుమార్లు అవినీతికి పాల్పడటం ద్వారా సొసైటీకి తీవ్ర నష్టం కలిగించినందున వారి వివరణలు చర్చించి సెక్షన్ 21 (1)(హెచ్)(ఐ) టీసీఎస్ యాక్ట్ 1964 ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటిస్తూ.. సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో సమావేశంలో ప్రెసిడెంట్ ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది..
దీంతో పాటుగా 29.09.2024 నాటి గత సమావేశం మినిట్స్ ను సమావేశం తుది ఆమోదం తెలిపింది. ఆ సమావేశంలో చర్చించిన అంశాలపై కార్యాచరణ నివేదికపై సర్వసభ్య సమావేశం చర్చించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయ, వ్యయాల నివేదిక అందజేయడంతో పాటు 2025-26 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించడం కూడా జరిగింది.. సొసైటీకి ఇంటర్నల్ ఆడిటర్స్ నియామకం వంటి పలు కీలకాంశాలపై సొసైటీ సర్వసభ్య సమావేశం చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. సొసైటీ సజావుగా నడవడానికి, సొసైటీలోని సభ్యులందరి మేలుకోరి తాను ఎల్లవేళలా పనిచేస్తానని.. సొసైటీలో ఎలాంటి అవకతవకలకు, అవినీతికి తావు లేకుండా ఉండేలా తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.. ఏవిధమైన సమస్యలున్నా తన దృష్టికి తీసుకునివస్తే ఆ సమస్యల పరిష్కారానికి సభ్యలందరి సహకారంతో ముందడుగు వేస్తామని తెలియజేశారు.