- జూన్ 27న కన్నప్పను రిలీజ్ ప్రకటించిన మంచు
మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 25కు రావాల్సిన మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు మోహన్ బాబు, విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం యోగికి శ్రీరాముడి ప్రతిమ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ను సీఎం యోగి చేతుల మీదుగా ఆవిష్కరించారు. జూన్ 27న కన్నప్పను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ప్రమోషన్లు పెంచుతామన్నారు. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు మంచు మనోజ్ జల్ పల్లిలోని ఇంటి వద్ద ధర్నా చేస్తున్నాడు. తన వస్తువులు అన్నీ విష్ణు ఎత్తుకెళ్లాడు అంటూ కేసు కూడా పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి విష్ణుపై చాలా ఆరోపణలు చేస్తున్నాడు. అటు మనోజ్ అంత రచ్చ చేస్తున్న టైమ్ లోనే.. ఇటు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, కాజల్ నటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 25కే రావాల్సిన సినిమాను.. వీఎఫ్ ఎక్స్ పనుల వల్ల వాయిదా వేసినట్టు విష్ణు తెలిపారు.