ఏపీలోని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పై హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్వీగ్గిను బాయికాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు నగదు చెల్లించకుండా స్వీగ్గి ఇబ్బంది పెడతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ నేల 14 నుండి రాష్ట్రంలోని హోటల్స్ , రెస్టారెంట్స్ లో స్వీగ్గి అమ్మకాలు నిలిపివేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వీ స్వామి తెలిపారు.