Thursday, November 21, 2024
spot_img

క్రితికా ‘పైసల’ కక్కుర్తీ

Must Read
  • క్రితికా ఇన్‎ఫ్రా డెవలపర్స్ మాయాజాలం
  • ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ
  • హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీనగర్ కేంద్రంగా దందా
  • 2020 లో సేల్స్ జరిగిన, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు మొదలుపెట్టని వైనం
  • కస్టమర్స్ నుండి కోట్లాది రూపాయలు వసూల్
  • ఆ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లింపు
  • భూమి, పైసలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు
  • ముఖ్య పాత్రదారులుగా మేనేజింగ్ డైరెక్టర్ రాధా భూక్య, డైరెక్టర్ గోపాల్, సీఈవో శ్రీకాంత్
  • న్యాయం చేయాలంటూ బాధితుల డిమాండ్..

ఎంతో కష్టపడి డబ్బు సంపాదించిన డబ్బును ఆదా, పెంపు చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వడ్డికిస్తే అవి వస్తయో, రావో అని, బ్యాంకులు పెడితే ఇంట్రస్ట్ తక్కువ అని చెప్పి కొందరు భూముల మీద పెట్టుబడి పెడుతుంటారు. మరికొందరు రేపు, రేపు ప్లాట్ల రేట్లు బాగా పెరిగిపోతాయని ఇల్లు కట్టుకుందామని సిటీకి కొంచెం దూరమైనా పర్లేదు.. కొద్ది రోజులు పోతే అదే డెవలప్ అయితదిలే అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారిని గుడ్డిగా నమ్మి ఉన్న డబ్బులన్నీ వాళ్ల చేతిలో పెడుతున్నారు. ఇందులో ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది, ఎవరు, ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నరు, ఈఎంఐ అవకాశం ఉన్నదా అని అత్యాశకు పోయి చివరకు రియల్టర్ల చేతిలో మోసపోతున్నారు. ఇలాంటిదే క్రితీకా ఇన్ ఫ్రా డెవలపర్స్.. లేని పోని మాయమాటలు చెప్పి ప్రజలను ఆకర్షించి వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు తీసుకొని చివరకు వారిని మోసం చేశారు. 2020 లో ప్రీ లాంచ్ పేరుతో సేల్స్ పెంచుకొని వారిని నట్టేట ముంచిన ఈ క్రితీకా సంస్థ నిర్వాహకులు ఇప్పుడు చేతులు ఎత్తేశారు.

వివరాల్లోకి వెళితే.. క్రితీకా ఇన్ ఫ్రా డెవలపర్స్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య పాత్రదారులుగా మేనేజింగ్ డైరెక్టర్ రాధా భూక్య, డైరెక్టర్ ధూమవాత్ గోపాల్, సంస్థ సీఈవో శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో సొంత ఇళ్ళు కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. దీని కోసం అహర్నిశలు కష్టపడి, రూపాయి, రూపాయి కూడబెట్టి తమ కలను సాకారం చేసుకుంటారు. ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు’ అన్న చందంగా అధికారులు రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతున్నది. ఇలాంటి వారిని తమ వలలో వేసుకోవడానికి నగరంలోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలను దండుకొని బాధితులను పట్టిపిడుస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీనగర్ కేంద్రంగా ఉన్న క్రీతికా ఇన్‎ఫ్రా డెవలపర్స్ వారు ప్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. వీరి మోసలను గ్రహించిన బాధితులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే వారే తిరిగి బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారు.

‘ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు’ అన్నట్టు ఒకరిని చూసి మరొకరు రియల్ ఎస్టేట్ బిజినెస్ వారు అమాయక ప్రజలను మోసపుచ్చుతున్నారు. హైదరాబాద్‎లో శివారు ప్రాంతమైన తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో ( శేషాద్రి ఒక్ ) పేరుతో ఎస్+6 అపార్ట్మెంట్ నిర్మిస్తామని 2020 లో ప్రీ లాంచ్ సేల్స్ చేసి ఇప్పటివరకు నిర్మాణం చేయలేదు. అలాగే ఉప్పల్ లో కూడా 3 ఎకరాల్లో ( శేషాద్రి సిల్వర్ ఒక్ ) గేటెడ్ కమ్యూనిటీ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తామని చెప్పి మొహం చాటేశారు. ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 150 మంది కస్టమర్స్ నుండి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి, 5 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణం చేపట్టకుండా, కస్టమర్స్ నుండి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వకుండా, ఇతర వ్యాపారంలోకి డబ్బులను మళ్లిస్తున్నారు. తమ డబ్బులను తమకు వాపసు ఇవ్వండి సారు..!! అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా వెంచర్లు చేసి ఒక్కో ప్లాట్లను ఎంతో మందికి అమ్ముతూ మోసం చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. అసలు వీరు డెవలప్మెంట్ కోసం తీసుకున్న ల్యాండ్ ఎంత.? సంస్థకు సంబంధించిన భూమి ఎంత..? 150 మంది కస్టమర్స్ వద్ద నుండి తీసుకున్న డబ్బును సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించరా..? ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్స్ వద్ద నుండి తీసుకున్న రూ.50 కోట్లకు పైగా సొమ్మును ఎక్కడికి దారి మళ్లించారు…? అసలు ఈ మొత్తం వ్యవహారంలో మేనేజింగ్ డైరెక్టర్ రాధా భూఖ్య, డైరెక్టర్ ధూమవాత్ గోపాల్, సంస్థ సీఈవో శ్రీకాంత్ పాత్ర ఎంతవరకు ఉంది.? అనే వివిధ సందేహాలపై ” ఆదాబ్ హైదరాబాద్” దినపత్రిక లోతైన విశ్లేషణతో మరిన్ని కథనాలతో త్వరలో మీ ముందుకు.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS