Friday, September 20, 2024
spot_img

నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Must Read
  • లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది
  • గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయి.
  • దీనికి తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు.. నీట్ పరీక్షలో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదు. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెబుతున్నారు.
  • కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.
  • గత 5 ఏళ్లలో తెలంగాణా నుంచి ఏ విద్యార్థి కూడా నీట్ లో టాప్ 5 ర్యాకింగ్‌లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అక్రమాలే కారణమని మేము నమ్ముతున్నాం.
  • గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుంది. కానీ కొంత మంది విద్యార్థుల గ్రూప్‌కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. అది సరైన విధానం కాదు.
  • ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
  • నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This