వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం సోమవారం లగచర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే గ్రామస్తులు రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు దుద్యాల, కొడంగల్, బోంరాస్ పేట మండలాలల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.