- మాజీమంత్రి హరీష్రావు
లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు.” మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదిస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు సహించలేక నా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు..నీకు చేతనైంది ఒక్కటే..తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడమని” హరీష్ రావు మండిపడ్డారు.
రుణమాఫీ విషయంలో దేవుళ్ళను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు..ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగంబజార్ పోలీస్స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టించినవు అని హరీష్ రావు విమర్శించారు.