Saturday, July 19, 2025
spot_img

సైనికుడి కోటాలో భూస్వామికి భూమి కేటాయింపు!

Must Read
  • అక్రమంగా ప్రభుత్వ భూములు దారాదత్తం..
  • మాజీ సైనికుని కోటాలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసిన బడా భూస్వామి..
  • సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, నందాపురం గ్రామంలో భూ దోపిడీ
  • 30 ఎకరాల పట్టా భూములు ఉన్న భూస్వామికి సైనికుడి కోటాలో ప్రభుత్వ భూమి కేటాయింపు!
  • తిరుమలగిరి మండల రెవిన్యూ అధికారుల బరితెగింపు!

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూముల దుర్వినియోగం మరోసారి వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, నందాపురం గ్రామంలో ఒక బడా భూస్వామికి మాజీ సైనికుని కోటాలో మరోసారి భూమిని దక్కించుకోవడం కలకలం రేపుతోంది. అప్పటికే 30 ఎకరాల పట్టా భూమిని కలిగి ఉన్న ఈ భూస్వామికి స్థానిక రెవిన్యూ అధికారులు మరో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ సైనికుని కోటాలో అతనికి కేటాయించారు. వాస్తవానికి ఈ భూమి నిజమైన అర్హత కలిగిన మరో మాజీ సైనికునికి చెందాల్సినది. కానీ అధికారుల అనాగరిక చర్యలతో, ఫేక్ పత్రాలు ఆధారంగా బడా భూస్వామి పేరు మీద ప్రభుత్వ భూమిని మంజూరు చేశారు.

YouTube player

30 ఎకరాల పట్టా భూములు ఉన్న భూస్వామికి సైనుకుని కోటాలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా కేటాయించారు..?
వివరాల్లోకి వెళితే, తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలా మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబానికి నందాపురం, తిరుమలగిరి గ్రామల శివారులో ఉన్న భూమి సర్వే నెంబర్లు157,158,160,165,167,214,215,216,219లలో సుమారు 35 నుండి 40 ఎకరాల పట్టా భూములు కలిగి ఉన్నారని రెవిన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2019లో ఈ వివరాలు అధికారికంగా నాటి ఇంచార్జ్ తహశీల్దారు గోలి హరిచంద్ర ప్రసాద్ కలెక్టర్ కు తన విచారణ నివేదికలో ధ్రువీకరిస్తూ, పేర్కొన్నారు (లేఖ నెం.బి/1542/19, తేది.07-10-2019).

ఇంత భూమిని కలిగి ఉన్న మోహన్ రెడ్డికి తిరుమలగిరి రెవిన్యూ అధికారులు నిస్సిగ్గుగా ఇతనికి మళ్ళి మాజీ సైనుకుని కోటాలో నందాపురం గ్రామా శివారులోని భూమి సర్వ్ నెం.159/అ నందు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా ఇతని పేరున అసైన్డ్ చేయడం జరిగింది. మాజీ సైనికులైన, స్వాతంత్ర సమరయోధులు ఎవరైనా సరే పూర్వం వారికీ ప్రైవేట్, ప్రభుత్వ భూములు కలిగి లేనట్లయితే వారి కుటుంబ జీవనాదారం కొరకు దేశానికి వారు అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రతిఫలంగా 5 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ భూమిని వారికీ అసైన్డ్ చేయడం జరుగుతుంది. కానీ తిరుమలగిరి మండల రెవిన్యూ అధికారుల అడ్డగోలు ఆలోచనలు, అవినీతిలో మునిగి ఇలాంటి అక్రమార్కులతో చేతులు కలిపి, కోట్ల విలువైన ప్రభుత్వ భూములను మోహన్ రెడ్డి లాంటి అనర్హులకు కట్టబెట్టి, భవిష్యత్ తరాలకు ఇక్కడి రెవిన్యూ అధికారులు తీరని ద్రోహం చేస్తున్నారు.

ఇది ఎప్పటికైనా ప్రభుత్వం కనిపిడితే, తనకు నష్టం అవుతోందని భావించిన మూల మోహన్ రెడ్డి మొన్నటి వరకు తన పేరున ఉన్న సంబంధిత భూములన్నింటిని తన భార్య, ఇద్దరు కుమారుల పేరు మీదకు పట్టాలు మార్పిడి చేసి, మాజీ సైనికుని కోటాలో ప్రభుత్వం ఇచ్చిన భూమి సర్వ్ నెం.159/అ చెందిన 5 ఎకరాలను మాత్రమే తన పేరున పెట్టుకున్నట్లు మండల రెవిన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈయన ఈ అక్రమాలు ఈవిదంగా ఉంచుకొని, తన భూమి పక్కనే ఉన్న మరో మాజీ సైనికుడైన మోదుగు కొండల్ రెడ్డి భూమిపై కన్నేసి, దాన్నీ కూడా ఏదోవిధంగా ఆక్రమించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరో మాజీ సైనికుని భూమిని ఆక్రమించిన వైనం…
తన అనారోగ్య కారణాల వలన మాజీ సైనికుడైన మోదుగు కొండల్ రెడ్డి తన భూమిని స్థానిక నందాపురం గ్రామానికి చెందిన ఓ భూస్వామికి తన 5 ఎకరాలు కౌలుకు ఇచ్చాడు. కౌలు దారుడితో చేతులు కలిపిన మూల మోహన్ రెడ్డి అక్రమంగా సదరు కొండల్ రెడ్డి భూమి నుండి 2 ఎకరాలు కౌలు దారు తనకు అమ్మినట్లుగా నకిలీ కాగితాలు సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ 2 ఎకరాలు దక్కించుకునేందుకు కొండల్ రెడ్డి కౌలుదారుడిని వెంటబెట్టుకొని కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగడం శోచనీయం. ఇది అసైన్డ్ చట్టం 1977 కు ఎదురు తిరగడమే అవుతుంది. ఇది ప్రభుత్వం పై బరిగితెగింపుకు తార్కాణం. ప్రభుత్వ భూముల బదలాయింపు అంత తేలికైన విషయం కాదని తెలిసి కూడా మోదుగు కొండల్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని కొట్టేసేందుకు కొనుగోలు డ్రామా ఆడటం ఎంతవరకు సబబో జిల్లా కలెక్టర్ పరిశీలించాలి.

నేడే కలెక్టర్ విచారణ
మోదుగు కొండల్ రెడ్డి తన భూమి విషయంలో రికార్డుల పరంగా నేటికీ తనకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ తనకు సి.సి.ఎల్.ఎ నుండి అధికారికంగా జారీ అయిన పట్టదారు పాసుపుస్తకంలో (పట్టదారు పాసు పుస్తకం నెం.టి29220020366, ఖాతా నెం.787) తహశీల్దారు డిజిటల్ సంతకం మిస్ కావడం, జరుగుతున్న జాప్యం గురించి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు జిల్లా కలెక్టర్ ను విచారణ చేసి తగిన న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది (కేసు నెం.16302 ఆఫ్ 2020). దీనిపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ నేడు విచారణ చేయనున్నారు. నిరుపేద అయినా మాజీ సైనికుడైన మోదుగు కొండల్ రెడ్డికి న్యాయం జరగాలని, జరుగుతుందని ఆశిద్దాం.

రెవిన్యూ శాఖ ప్రశ్నించాల్సిన విషయాలు:

  • ఇప్పటికే 30 ఎకరాల భూమి కలిగి ఉన్న వ్యక్తికి మరోసారి భూమి ఎలా కేటాయించారు?
  • సైనిక కోటాలో భూమిని పొందేందుకు అర్హత పత్రాలు ఎలా జారీ అయ్యాయి?
Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS