Tuesday, December 3, 2024
spot_img

ఆగని కబ్జాలు

Must Read
  • రూ.కోటి విలువ చేసే 500 గజాల స్థలం కబ్జాకు యత్నం
  • నిద్రమత్తు వదలని అధికారులు
  • చోధ్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం
  • బోర్డులను తొలగించి కబ్జా చేస్తున్న భూ బకాసురులు
  • ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటున్న ప్రజలు, నాయకులు

ఒక పక్క రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ స్థలం ఒక్క గజం కూడా కబ్జాకు గురైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతుంటే మరోపక్క కొత్తగూడెం మున్సిపాల్టీలో కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఖాళీ స్థలంలో ప్రభుత్వ భూమని ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి ఆస్థలాలను కొంతమంది భూ బకాసురులు మున్సిపాల్టీలో 36వార్డుల్లో ఏదో ఒక మూల ప్రతిరోజూ ప్రభుత్వ స్థలాల కబ్జాకు యత్నిస్తూనే ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ప్రభుత్వ స్థలాలను కబ్జాచేస్తూనే ఉన్నప్పటికీ అధికారులు, పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై వివిధ పార్టీల నాయకులతోపాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ స్థలంలో పాతిన బోర్డులను తొలగించి మరీ కబ్జా చేస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. నిద్రమత్తును వీడడం లేదు. అందుకు కారణం కబ్జాదారుల నుంచి పెద్దఎత్తున ముడుపులు అందుతు న్నాయని అందుకే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాల్టీ పాలకవర్గం ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం మున్సిపాల్టీ నిధుల నుండి రూ. 20 లక్షలు కేటాయించి పరిరక్షణకోసం పెన్షింగ్‌, బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.కానీ మున్సిపాల్టీలోని 2వ వార్డులో జిల్లా ఎస్పీకార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది యధేశ్చగా ప్రభుత్వం భూమంటూ సూచించిన బోర్డును తొలగించి మరీ సుమారు రూ.కోటి విలువ చేసే 500 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మున్సిపాల్టీలో ఉన్న 36వార్డుల్లో ఉన్న ప్రభుత్వస్థలాలను గుర్తించి పెన్షింగ్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలన కాపాడాలని పట్టణ ప్రజలతోపాటు వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.

Latest News

లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను

మాజీమంత్రి హరీష్‎రావు లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS