Friday, March 21, 2025
spot_img

పైసలు ఇచ్చుకో… భూమి ఆక్రమించుకో..

Must Read
  • బండ్లగూడలో రూ.కోట్లు విలువైన స్థలాలు స్వాహా
  • హైదరాబాద్‌ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ
  • కోట్ల విలువైన సర్కారు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ఆఫీసర్లు
  • రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాటు చేసి అమ్మిన ఓ నాయకుడు
  • ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది
  • అక్రమణల తీరుపై ఆదాబ్‌ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం
  • జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను కాపాడాలంటున్న స్థానికులు
  • అవినీతి అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్

తెలంగాణలో అవినీతి అధికారుల రాజ్యం నడుస్తోంది. పైసలకు ఏ పని అయినా చేసి పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను సైతం కట్టబెడుతున్నారు. రాజకీయ, డబ్బు బలం ఉన్న వ్యక్తులకు అమ్ముడుపోతున్నారు. నాది కాదు నా అత్తగారు సొమ్ము అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కంచే చేను మేసినట్లు ఉంది రెవెన్యూ అధికారుల తీరు. సర్కారు స్థలాలు రక్షీంచాల్సిన రెవెన్యూ అధికారులే అమ్రార్కులకు కొమ్ము కాస్తోండడం గమనార్హం. నెలనెలా రూ.లక్షల్లో జీతాలు తీసుకోవడమేగాక కాసులకు కక్కుర్తి పడి రూ.కోట్ల విలువైన సర్కారు భూముల్ని కొందరికీ ఆఫీసర్లే ధారాదత్తం చేస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు కబ్జాలను నిర్మోలించేందుకు అడుగులు వేసినా… రాజకీయ మద్దతు వారికి మెకాలడ్డుతోంది. ఈ భారి స్థాయి భూదందాకు పాతబస్తీ చాంద్రాయణగుట్ట సెగ్మెంట్‌ బండ్లగూడ కేంద్రంగా మారింది. ఇక్కడి మండల కార్యలయం పరిధిలో సాగుతున్న అక్రమణల తీరుపై ఆదాబ్‌ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం…

అక్రమార్కుల చెరలోనే చెరువులు :
సాధారణంగా ఏదైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనప్పుడు స్థానిక అధికారులు స్పందిస్తారు. ఒక వేళ అది జరగలేదంటే ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారని అర్థం చేసుకోవచ్చు. మరి జిల్లా కలెక్టర్‌ దృష్టికి కూడా ఆ కబ్జా బాగోతం వెళితే..?? వాస్తవంగా క్షణాల్లో అధికార యంత్రాంగం కదలాలి. కబ్జాకోరలు తీసేయాలి. కానీ…?? గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓ నీటి వనరు కళ్లముందు అన్యాక్రాంతమైనా ఏ ఒక్క శాఖ అధికారులు కూడా స్పందించక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా పాలనాధికారి (కలెక్టర్) ఆదేశించినా ఫలితం లేకపోవడం అధికారులు చేష్టలుడిగినట్లుగా వ్యవహారిస్తున్నారేందుకు చక్కటి నిదర్శనం. పల్లెచెరువు, గౌస్‌నగర్‌ ,చెరువు, మాన్మానికుంటా చెరువు, సర్వేనెంబర్‌ 103, 2, 8ఎకరాల 6గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ గజం రూ.40 నుంచి రూ. 60వేల వరకు ధర పలుకుతుంది. స్థానికంగా ఉండే ఓ నాయకుడు రెవెన్యూ అధికారులతో కలిసి ఈ భూమిని కబ్జా చేసి ప్లాటుగా చేసి అమ్మేశాడు.

కోట్ల విలువైన భూములు ఇక్కడే :
హైదరాబాద్‌ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం షేక్‌పెట్‌ తరువాత, స్థానం బండ్లగూడదే. ఇక్కడ సర్కారు జాగలు పెద్ద విస్తీరణంలో ఉన్నాయి. కబ్జాదారులు దర్జాగా వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. క్షేత్రస్థాయి అధికారి ఒకరు లోపాయికారి వ్యవహారాల్లో పీకలోతుదాక మునిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి కొన్ని స్థలాలకు సంబందించి న్యాయస్థానం స్టేటస్‌ కో (యధాస్థితి) ఉత్వర్వులు వెలువరించినా కబ్జాదారులు వెనక్కి తగ్గలేదంటే వారు ఎంతకు తెగించారు అర్థం చేసుకోవచ్చు. అయినా అధికారుల్లో చలనం రావడం గమనార్హం. వారు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది :
బండ్లగూడ మండల పరిధిలో అత్యంత విలువైన భూములు అవి. వాటి రక్షణకు మాత్రం రెవెన్యూ అధికారులు గాలికోదిలేశారు. అధికారుల ఉదాసినత కారణంగా ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. స్థిరాస్తి రేట్లు పెరుగుతుండంతో కబ్జారాయులు తమ ప్రతాపం చూపుతున్నారు. దీని బండ్లగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించే కొంత మంది సిబ్బంది అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. కబ్జారాయులతో కలిసి వారు ప్రభుత్వ భూములను అమ్మేసుకుంటున్నారు. చాంద్రాయణగుట్ట సెగ్మెంట్‌ బార్కాస్‌ డివిజన్‌ బండ్లగూడ గౌస్‌నగర్‌ ఏరియలో ఉన్న ప్రభుత్వ భూములు లావణి పట్టా భూములను యాదేచ్చగా అక్రమించి అమ్ముతున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్‌ గానీ అటు వైపు కన్నేత్తి కూడా చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఇక్కడ పనిచేస్తున్న సర్వేయర్‌కు చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదు. మండల కార్యాలయంలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు తమకు వాటాలు టంచన్‌గా వచ్చిన వెంటనే కబ్జారాయులు వంతు పాడుతున్నారు. దీనిని చక్కటి నిదర్శనం పల్లేచెరువులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలే. చాలామటుకు చెరవును రాతిర్రాత్రే మట్టితో కప్పి ప్రహారి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్న మండల అధికారులు స్పంధించక పోవడం వెనుక ఆంతర్యమేంటో.

మూడు పూలు, ఆరు కాయాలు :
హైదరాబాద్‌ మహానగరంలో ఇలాంటి అవినీతి మూడు చెరువులు ఆరు ధృవీకరణ పత్రాల్లో విరాజిల్లుతున్నాయి. రెవెన్యూ ఇరిగేషన్‌, అధికారులకు ఇవి కాసులు కురిపిస్తున్నాయి. ఓ వైపు కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి చెరువుల పరిరక్షణకు కంచెలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పలు శాఖలు ఇలా అడ్డగోలుగా ఆక్రమణదారులకు వంతు పాడుతుండం విస్మయానికి గురిచేస్తోంది. తద్వారా చెరువులు తమ స్వరూపాన్ని కోల్పోతున్నాయి.

జిల్లా పాలన అధికారి (కలెక్టర్) దృష్టి సారించాలి :
హైదరాబాద్‌ పాతబస్తీ బండ్లగూడ పరిధిలో జరగుతున్న భూ దందాపై జిల్లా కలెక్టర్‌ దృష్టిసారించాలని, ప్రభుత్వ భూముల రక్షణకు గాలికి వదిలేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరీ ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ఎలా వ్యవహారిస్తారో వేచిచూడాలి.

Latest News

ప్ర‌భుత్వ భూమిని భ‌క్షిస్తున్న భూ బ‌కాసురులు

గండిపేట్ మండ‌లంలో కోట్ల విలువైన భూమి క‌బ్జా కోకాపేట స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో భూ కబ్జా సుమారు 30 ఎకరాల భూమి మాయం ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS