తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.