యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.