రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప – 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ ఆరోపించారు. సినిమా ప్రదర్శన సంఖ్యను పెంచడం సరైనది కాదని పిటిషనర్ వాదనకు కోర్టు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూచించింది.