Tuesday, December 3, 2024
spot_img

మద్దెల చెరువు మాయం

Must Read
  • 11.70 ఎకరాల చెరువు కబ్జా చేసిన కేటుగాళ్లు
  • నిషేధిత జాబితా నుండి తొలగింపు
  • 2017లో ఇరిగేషన్ అధికారులు లెక్కల ప్రకారం 11ఎకరాలకు పైనే
  • కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం కామన్ అయిపోయింది. భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఓ పక్క హైడ్రా కబ్జాలపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుండగా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాచేసి ఇళ్లు, నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేస్తుంది. కాగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు అవినీతి రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల సహకారంతో మద్దెల చెరువునే మాయం చేయడం విస్మయానికి గురిచేస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని సర్వేనెంబర్ 335లో 2017లో ఇరిగేషన్ అధికారులు మద్దెల చెరువు విస్తీర్ణం 11.70 గుర్తిస్తూ ఇరిగేషన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి చెరువు ఎఫ్.టి.ఎల్ స్థలాన్ని 2024లో ప్రైవేటు భూమిగా చూపిస్తూ నిషేధిత జాబితా నుండి తొలగించడంలో అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 8ఎకరాల చెరువుని మట్టి బండరాళ్లతో పూడ్చి కబ్జాకు పాల్పడ్డా నేటికీ కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తుంది.

ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చడంలో అప్పటి రెవెన్యూ అధికారులకి కబ్జాదారుల నుండి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారనే ఆరోపణ సైతం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అప్పటి ప్రభుత్వంలోని కొందరి పెద్దల సహకారంతోనే భూ కబ్జాదారులు రెచ్చిపోయి మరి చెరువులు, కుంటలు అని తేడా లేకుండా కబ్జాలు చేస్తూ వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. కబ్జాదారులని ప్రశ్నిస్తే దాడులకు సైతం పాల్పడ్డ సంఘటనలు ఈ ప్రాంతంలో గతంలో అనేకం చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం మరీనా కబ్జాదారుల తీరు మారకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. ప్రభుత్వ పెద్దలు మద్దెలచెరువు కబ్జాపై దృష్టి సాధించాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి : ఆకుల సతీష్

ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపిస్తూ చెరువు పూర్తి విస్తీర్ణంలోని సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. 2017లోనే ఇరిగేషన్ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని నోటిఫికేషన్ జారీ చేశారు. 2024లో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చడంలో అధికారుల పాత్ర స్పష్టంగా ఉంది. 2022 వాల్టా చట్టానికి తూట్లు పొడిచిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి. కబ్జాదారులపై వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలి.

Latest News

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS