- కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన మలక్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
- మలక్‌పేట్ సర్కిల్ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న డిప్యూటి కమిషనర్
- స్వార్థ ప్రయోజనాల కోసం రిలీవ్ అయిన జవాన్‌లను విధుల్లోకి తీసుకోని వైనం
- డిప్యూటి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటున్న ఉద్యోగ సంఘ నాయకులు..
- తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ చేస్తూ జీహెచ్ ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. 30 సర్కిళ్లకు సంబంధించిన 139 మందిని బదిలీ చేసినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 269 మంది శానిటరీ జవాన్లు పనిచేస్తుండగా అందులో 5 సంవత్సరాలు పైబడి ఒకే సర్కిల్‌లో పనిచేస్తున్న 139 మంది శానిటరీ జవాన్లను వారి రిక్వెస్ట్ పై వారికి కావాల్సిన సమీప సర్కిళ్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అసలు విషయానికొస్తే.. మలక్‌పేట సర్కిల్‌లో 15 మంది జవాన్ల కు బదిలీలు అయ్యాయి.. కానీ అందులో చౌనీ డివిజన్ యాదయ్య, అక్బర్‌బాగ్ డివిజన్ యాదగిరి, చౌనీ డివిజన్ సూర్యప్రకాష్, అక్బర్‌బాగ్ డివిజన్ బాబు లను రిలీవ్ చేయకుండా యధావిధిగా కొనసాగుతున్నారు. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఇతర సర్కిల్ లోని డిప్యూటీ కమిషనర్ లు వారి వద్ద ఉన్న జవాన్ లను రిలీవ్ చేశారు. వివిధ సర్కిల్‌ల నుండి రిలీవ్ అయ్యి వచ్చిన నలుగురు జవాన్లు మలక్ పేట్ డిప్యూటీ కమిషనర్ వారికి విధుల్లోకి తీసుకోకుండా పాతవారినే కొనసాగిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలను సైతం పట్టించు కోకుండా డిప్యూటీ కమి షనర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిం చడం పట్ల పలు అనుమానాలకు తావీస్తుంది.. కాగా, బదిలీపై వచ్చిన ఆ నలుగురి పరిస్థితి ఏంటనే అంశంపై ప్రస్తావిస్తే ఎలాంటి సమాధానం లేకపోవడం, వారిని తిరిగి ముందు విధులు నిర్వర్తించిన సర్కిల్ కి వెళ్లాలని డిప్యూటి కమిషనర్ హుకుం జారీ చేయడం విడ్డూరం.
నర్సింగరావు అనే జవాన్ గత 18 సంవత్సరాలుగా మలక్‌పేట సర్కిల్‌లోని సైదాబాద్ డివిజన్, అక్బర్‌బాగ్ డివిజన్‌లో తిష్ట వేశాడు. నర్సింగ్ రావు చాలా కాలంగా పలు ఆరోపణలు రావడంతో అతనికి టౌన్ ప్లానింగ్ విభాగానికి బదిలీ చేశారు. జిహెచ్‌ఎంసిలో ఓ ప్రముఖ యూనియన్ నాయకుడు కావడం వలన జవాన్‌ల బదిలీల విషయం ముందస్తుగా తెలుసుకొని టౌన్‌ప్లానింగ్ విభాగానికి విధులు నిర్వర్తిస్తున్న అతగాడు మళ్లీ 139 మంది శానిటరీ జవాన్ ల జనరల్ బదిలీలల్లో తిరిగి సైదాబాద్ డివిజన్‌కు జవాన్‌గా పోస్టింగ్ చేపించుకున్నాడు.
మలక్‌పేట్ డిప్యూటి కమిషనర్ చట్టాలకు లోబడి విధులు నిర్వర్తంచకపోవడమే కాకుండా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను సైతం భేఖాతర్ చేస్తూ.. పాత జవాన్లను రిలీవ్ చేయ కుండా స్వార్థ ప్రయోజనాల కోసం యదావిధిగా కొనసాగించడం ఏంటని ఉద్యోగ సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటి కమిషనర్‌కు విషయ పరిజ్క్షానం లేదని సర్కిల్‌లో ఏవిధంగా విధులు నిర్వర్తించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్ దృష్టి సారించి డిప్యూటి కమి షనర్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..