Thursday, April 3, 2025
spot_img

మరోసారి భద్రత బలగాల బేస్ క్యాంప్‎పై మావోయిస్టుల దాడి

Must Read

ఛత్తీస్‎గడ్‎లోని బీజాపూర్ జిల్లాలో భద్రత బలగాల బేస్ క్యాంప్‎పై మావోయిస్టులు మరోసారి దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలోని పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 02 పోలీస్ బేస్ క్యాంప్‎పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. సమీప ఆసుపత్రికి తరలించి గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ దాడుల వెనుక హిద్మా హస్తం ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజుల్లో భద్రత బలగాలపై మావోయిస్టులు దాడులు చేయడం ఇది రెండోసారి.

శుక్రవారం కూడా బీజాపూర్ జిల్లాలోని జీడిపల్లిలో భద్రత దళాల బేస్ క్యాంప్‎పై మావోలు దాడి చేశారు. అప్రమత్తమైన బలగాలు వెంటనే కౌంటర్ ఇచ్చాయి. అర్ధరాత్రి నుండి భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS