Wednesday, January 29, 2025
spot_img

పర్మిషన్ ‘లేకుండానే’ మాస్టర్ మైండ్స్ పాఠశాల

Must Read

(మాస్టర్ మైండ్ తో అనుమ‌తులు లేకుండానే స్కూల్ కొన‌సాగింపు)

  • జీహెచ్ఎంసీలో యదేచ్ఛగా గుర్తింపు లేని పాఠ‌శాలు
  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
  • మామూళ్ల మత్తులో జోగుతున్న ఉప విద్యాశాఖ అధికారి
  • స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని డీఈఓకు ఫిర్యాదులు
  • పాఠశాలపై చ‌ర్య‌లు తీసుకోని మండ‌ల ఉప‌విద్యాశాఖ అధికారి
  • లోపాయికారి ఒప్పందాల‌తో చ‌ర్య‌లు తీసుకోని మండల ఉప‌విద్యాశాఖ అధికారి

రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు బాధ్యతను మరుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొని… విద్యాశాఖ నియమ నిబంధనల ప్రకారం కొనసాగాలి. అందరికీ సరిపడ క్లాసు రూంలు, అర్హత కలిగి ఉన్న టీచర్స్, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టి వంటివి ఓ స్కూల్ కు తప్పనిసరి ఉండాలి. అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ 1, విద్యాహక్కు చట్టానికి లోబడి పాఠశాలలు నడపాల్సి ఉంటుంది. కానీ నేడు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ పుట్టుకొచ్చాయి. ఇంతోడు, అంతోడు ఓ స్కూల్ పెట్టి అందులో పది చదివిన వాళ్ళను టీచర్లుగా నియమించి వాళ్లకు 8వేలు, 10వేలు జీతం ఇస్తూ టెన్త్ క్లాస్ వరకు చదువు చెప్పిస్తున్నారు. ఓ బంగ్లా (అపార్ట్ మెంట్) లేదా వాణిజ్య బిల్డింగ్ లో కొంత భాగం కిరాయి తీసుకొని అందులోనే 1 నుంచి 10వ తరగతి వరకు కొనసాగిస్తున్నారు. ఆ స్కూల్ లో పేద, మధ్య తరగతి పిల్లలను చేర్చుకొని వాన కాలం, యాసంగి కాలం చదువులు చెబుతూ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

వీటికి తోడు మరో వైపు సిటీలో పెద్ద ఎత్తున కార్పొరేట్ స్కూల్స్ పుట్టుకొచ్చాయి. శ్రీ చైతన్య, నారాయణ, మాస్టర్ మైండ్స్ వంటివి ఒకటి రెండు ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకుంటాయి. కానీ అవే పేర్లతో జీహెచ్ఎంసీ పరిధిలో పదుల సంఖ్యలో పాఠశాలలను ఏర్పాటు చేశారు. గమ్మత్తు ఏమిటంటే వాటిలో ఏ ఒక్క దానికి విద్యాశాఖ నుంచి అనుమతులు ఉండవు, కనీసం ప్రభుత్వం గుర్తింపు సైతం ఉండని పాఠశాలలు సిటీలో కోకొల్లలు ఉన్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి యాజమాన్యాలు. పేదోడి రక్తాన్ని జలగల్లా పట్టిపీడిస్తున్నయి. తీరా సదరు పాఠశాల గురించి వాకబు చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్నారని విషయం తెలిసిన పేరెంట్స్ అవాక్కువ్వుతున్నారు. విద్యాశాఖ అధికారులు మామూళ్లు తీసుకొని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పుల్ సపోర్ట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా హైద‌రాబాద్ జిల్లా విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఫలక్‌నుమాలోని మాస్ట‌ర్ మైండ్ పాఠ‌శాల కొన‌సాగుతుంది. అయితే దీనిపై ఉప విద్యాశాఖ అధికారికి కంప్లెయింట్ చేసిన పట్టించుకోవట్లేదు. ఆదాబ్ ప్రతినిధి మండ‌ల ఉప‌విద్యాశాఖ అధికారిని, గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలపై వివరణ కోరగా పాఠశాల యజమాన్యానికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. కానీ గతంలో ఎప్పుడో నోటీసులు జారీ చేసి ఈరోజు వరకు పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మండల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పాఠశాల యజమాన్యంతో భారీ ఎత్తున ముడుపులు తీసుకొని చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణ‌లు సైతం ఉన్నాయి.

ఈ పాఠ‌శాల విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం నుండి నేటి వ‌ర‌కు ఎలాంటి అనుమ‌తులు లేకుండా కొన‌సాగుతున్న మండ‌ల ఉప‌విద్యాశాఖ అధికారి చ‌ర్య‌లు చేపట్టకపోవడం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం శోచ‌నీయం. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ స‌భావ‌ట్ క‌ళ్యాణ్ ఈ విష‌యంపై అనేక సార్లు ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకేళ్లిన నోటీసులు జారీ చేసి, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కాలాయాప‌న చేస్తున్నార‌ని, ఉప విద్యాశాఖ అధికారి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంతో జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్ప‌టికైనా గుర్తింపులేని పాఠ‌శాల‌లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అక్ర‌మంగా కొన‌సాగుతున్న మాస్ట‌ర్ మైండ్స్ పాఠ‌శాల యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థి త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

కొండంత.. ప్రాబ్లమ్స్

సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్ భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు టెండర్లు యదా తదం దోపిడీ కామన్ భక్తుల జేబులు గుల్ల వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS