- పల్నాడు పర్యటనలో ముగ్గరుని పొట్టన పెట్టుకున్న జగన్
- నెల్లూరు పర్యటనలో మండిపడ్డ మంత్రి లోకేశ్
ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాప్టర్లలోనే తిరుగుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళ్తున్నారని.. పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారని మండిపడ్డారు.
’జనసమీకరణ మనం చేయలేక కాదు.. మనవల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. కార్యకర్త కారు కిందపడితే కనీసం దిగి చూడలేదు. దిగి చూసి ఆసుపత్రికి పంపించి ఉంటే బతికేవాడు. బాధిత కుటుంబం తల్లిని తీసుకువచ్చి కనీసం కూర్చోపెట్టలేదు. గ్లాస్ మంచినీరు అయినా ఇచ్చారా? సొంత కార్యకర్త చనిపోతే నిల్చొని రెండు భుజాలు తట్టి వెళ్లిపోయారు’ అంటూ ఫైర్ అయ్యారు.వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బ్లేడ్ బ్యాచ్‌ను, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారని.. అప్పుడే భయపడలేదని.. రప్పా, రప్పాకు భయపడతామా అని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందన్నారు. కానీ తిరగమంటే మనుషులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారన్నారని మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు.