తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ సీఎం కేసీఆర్‌ని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‌కి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించమని తెలిపారు.