Thursday, July 17, 2025
spot_img

కాలేశ్వరం ప్రాజెక్టు అక్ర‌మార్కుల‌ను వ‌ద‌లం

Must Read
  • ప్ర‌తి పైసా రికవరీ చేస్తాం.. నిరుపేదలకు పంచుతాం!!
  • నీరు నిలువ ఉంచవద్దని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ అనుభవజ్ఞులు చెబుతున్నారు
  • గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి

గత బీఆర్ఎస్ పాలకులు అధికారులు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని, ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లు, పాలకుల ఆస్తులు అటాచ్ మెంట్ చేసి తిరిగి తీసుకువచ్చి తెలంగాణ ఖజానాలో ఉంచి పల్లెల్లో ఉన్న పేద ప్రజలకు పంచాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాదులోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పై విధంగా మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఈ ఎన్ సి మురళీధర్ రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తే ఇప్పటివరకు 500 కోట్ల ఆస్తులు బయటపడ్డాయని ఇంకా దాడులు జరగవలసి ఉన్నాయని మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారని ఆయన అన్నారు.

భారతదేశంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు ఒక విన్నుతనమైన ప్రాజెక్టు అని 18 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయడం కోసం నిర్మించారని 13 జిల్లాలకు నీరు అందే విధంగా డిజైన్ చేయడం జరిగిందని ఎనిమిది వందల పుస్తకాలు చదివి కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తయారు చేయడం జరిగిందని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ పాలకులు చెబుతూ వచ్చారని ఇప్పుడు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని ఆయన ఆరోపించారు. ధన దాహానికి కక్కుర్తి పడి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని లక్షల కోట్లు గంగపాలు చేసిన పాలకులు అధికారులు కాంట్రాక్టర్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సీఈ గా పనిచేసిన హరి రామ్ నాయక్ దగ్గర 3 నుండి 400 కోట్లు అక్రమార్జన కనిపిస్తే ఈఈ ఇరిగేషన్ వద్ద 200 కోట్లు అక్రమార్జన బయటపడుతుందని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అధికారులే ఇంత విధ్వంసంకు పాల్పడితే పాలకులు ఎంతటి విధ్వంసానికి తెగించారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని ఆయన ధ్వజమెత్తారు. పైపుల సరఫరా విషయంలో కూడా వేలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అధికారులను టచ్ చేస్తేనే ఇన్ని అక్రమ నిధులు బయటపడుతున్నాయని గత పాలకులను టచ్ చేస్తే ఎన్ని కోట్లు బయటపడతాయో స్పష్టమవుతుందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి కెసిఆర్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దోచుకున్నారని ఆ దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని ఆయన అన్నారు. ప్రతి నెల 6000 వేల నుండి 8000 కోట్లు కరెంట్ బిల్ చెల్లించవలసి వస్తుందని కేటీఆర్ కు చిత్తశుద్ధి లేదని ట్విట్టర్లో పోస్టులు పెట్టడం తప్ప అభివృద్ధి ధ్యాస లేని వ్యక్తి కేటీఆర్ అని ఆయన ఆరోపించారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరిగ్గా లేదని నీరు నిల్వ ఉంచితే ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలకు ప్రమాదకర సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ అనుభవజ్ఞులు చెప్తున్నారు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ కూలితే ఏమవుతుంది ఒక పిల్లర్ కూలదా అని గత పాలకులు మాట్లాడుతున్నారని ఆయకట్టు కింద జీవిస్తున్న ప్రజల ప్రమాదకర జీవనసమస్యను మాత్రం ఆలోచించడం లేదని ఆయన ఆరోపించారు. నీరు నిల్వ ఉంచడం చాలా ప్రమాదమని చెప్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని నిందించే ముందు గత పాలకులు చేసిన విధ్వంసం గురించి మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు.

నిన్నటి నుండి మురళీధర్ పై జరుగుతున్న సోదాలు ఆయన వెనుక ఉన్న పెద్ద చేపలు ఎన్నిఉన్నాయో ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరిపి వారిని కూడా పట్టుకొని అక్రమంగా సంపాదించిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పోరాటం చేస్తుంది . అవినీతి జరగకుండా పారదర్శకంగా పనిచేస్తున్నాం ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గమనించాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అధికారుల పాలకుల ధన దాహానికి తెలంగాణ విధ్వంసం జరిగిందని ఈ విధ్వంసాన్ని తప్పకుండా రికవరీ చేసి ఎవరైతే పెద్ద మనుషులు అక్రమంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారో వారి ఆస్తులను అటాచ్‌మెంట్ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు, హరీష్ రావు, చేతుల్లోనే ఉందని ఆ కుటుంబం చేసిన విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ విధ్వంసం కెసిఆర్ కుటుంబంలో మామ అల్లుళ్లు కలిసి చేశారని వీరి ఆస్తులపై ఏసీబీ విచారణ జరిపి అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సంపాదన కొల్లగొట్టిన వీరిని ప్రభుత్వం వదిలిపెట్టవద్దని ఆయన అన్నారు.

Latest News

అదరగొట్టిన భారత మహిళల జట్టు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS