- మోడల్ స్కూల్‌కి వెళ్లాలంటే ఈ రోడ్డుపై పల్టీలు కొట్టాల్సిందే..!
- ఉపాధ్యాయులు మారుతున్నారు, కానీ మోడల్ స్కూల్ రోడ్డు
దుస్థితి మాత్రం మారడం లేదు. - అధ్వానంగా తయారైన మోడల్ స్కూల్ రోడ్డు
- పట్టించుకునే నాధుడే లేడు.
- బడి పిల్లలం సారూ… కొంచెం మా స్కూల్ కి రోడ్డు
వేయించండి సారూ..!
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠం పల్లి మండలంలోని మోడల్ స్కూల్ రోడ్డు గురించి పట్టిం చుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్కూల్ విద్యార్థులు. ఈ మోడల్ స్కూల్ కి వెళ్లాలంటే విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ స్కూల్ రోడ్డు గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. చిన్న చినుకు పడినా మోడల్ స్కూల్ రోడ్డు మొత్తం బురద, గుంతల మయంగా మారుతుంది. ఈ రోడ్డు నుండి స్కూలుకి రావాలంటే పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి. ఆ బురద గుంటలో ఎక్కడ పడిపోతామో అని పక్కన ఉన్న చెట్లు, పొలాల నుండి వెళ్లాల్సిన పరిస్థితి. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా వేరే మండలాల నుండి కూడా విద్యార్థులు ఈ మఠంపల్లి మోడల్ స్కూల్లో చదువుతున్నారు. అక్కడ స్కూలుకు వెళ్లే రోడ్లో కంపచెట్లల్లో నుండి వెళ్లే సమయంలో ఏమైనా విషపురుగులు కుట్టిన పట్టించుకునే వారు ఉండని పరిస్థితి. ప్రమాదం జరిగినప్పుడు స్పందించే కంటే ముందే జాగ్రత్త పడి రోడ్డు వేయిస్తే బాగుంటుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు నాయకులు అప్పుడప్పుడు స్కూల్ కి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వస్తారు వెళ్ళిపోతారు. కానీ ఈ రోడ్డు గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. పేరుకేమో మోడల్. స్కూల్ రోడ్డు మాత్రం చూస్తే గుండెలు హడలు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇకనైనా స్థానిక నాయకులు గానీ అధికారులు గానీ ఈ విషయం మీద దృష్టి సారించి రోడ్డు వేయించగలరని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రిన్సిపాల్ రామ్ నరేష్ వివరణ
మఠంపల్లి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ రోడ్డు ఇబ్బంది గత పది సంవత్సరాల నుంచి అలాగే ఉంది. మేము మోడల్ స్కూల్ కి వచ్చి పది రోజులే అవుతుంది. ఈ రోడ్డు సమస్య గురించి పై అధికారుల దృష్టికి, స్థానిక నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.