ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
పోలీసులు అయిన నివాసం వద్ద నిఘా పెట్టాలని, ప్రతి 02 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశించింది.