మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ సొమ్ము కర్ణాటక, మహారాష్ట్ర , పంజాబ్ రాష్ట్రాల పాలయ్యాయని విమర్శించారు. వందల కిలోమీటర్లు ఉన్న నమామి గంగేకు 40 వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతల నిర్మాణాల జోలికి వెళ్ళే దమ్ముందా అని సవాల్ విసిరారు.