తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేలా, సిల్వర్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫరెంట్‌గా..నా రూటు వేరు అన్నట్లు ఉంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెరకెక్కించినట్టు చెప్పారు. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్రౌన్ అవ్వబోతోందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జోనర్లో ఇదొక కలికితురాయి నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే M4Mను ఐదు భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు.టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ పవన్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా పనితనం. వంటి తమ టీమ్ వర్క్ హాలీవుడ్ రేంజ్‌లో వచ్చాయని ప్రశంసించారు.