- మంత్రి కొండా సురేఖ
నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని తెలిపారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.
బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్ కారణం అని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, మరికొందరు సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారని విమర్శించారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా అని ప్రశ్నించారు. ఎంతోమంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ అడుకున్నాడని సంచలన కామెంట్స్ చేశారు.కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.