తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని , ప్రతిష్ట దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కినేని నాగార్జున కుటుంబం , సమంత పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.