వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలలో దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ను దాదాపు 2500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం 2,900 ఎకరాల భూములు వైజాగ్ లోని ఈస్టర్న్ నావల్ కమాండ్ కు కేటాయించింది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే జలాంతర్గగాములు, నౌకల నుంచి వచ్చే సంకేతాల పర్యవేక్షణ కొరకు ఇది పని చేస్తుంది. దేశంలో 14 ప్రాంతాలలో ప్రపొజల్స్ ఉన్నా కూడా కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ భూములు ఇస్తామని ముందుకోచ్చిన వాటిని కాదని తెలంగాణ అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసే విధంగా ధామగుండంలో ఏర్పాటు చేయడంలో గల పాలకుల దురుద్దేశం ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు కొరకు 12 లక్షలకు పైగా చెట్లు నరికి వేయడం జంతు, పశు, పక్ష్యాదుల మనుగడకు జీవన్మరణ సమస్యే రాడార్ కేంద్రం ఏర్పాటుతో పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపడంతో పాటు మహానగరమైన హైదరాబాద్ కు ప్రకృతి వికృతిగా మారి హైదరాబాద్ కు తరచూ వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మూసిమీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అనేది పర్యావరణ విశ్లేషకుల అభిప్రాయం. ఔషద మొక్కలతో అరుదైన వృక్షాలతో జీవ వైవిద్యం కలిగిన అడవిలోని చెట్లను నరకడాన్ని స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక ప్రజలు దశాబ్ద కాలం పాటు దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం చేశారు. ధామగుండం అటవీ భూముల పరిరక్షణ కోసం గతంలో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంలో 12,12,753 చెట్లను నరికి వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అప్పటి అటవీ సంరక్షణ ప్రధానాధికారి హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ పెను ప్రమాదంగా మారి దామాగుండ పర్యావరణానికి యమగండంగా మారబోతున్నది ఈ ప్రాజెక్ట్ కు కేటాయించిన భూములను, అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పున సమీక్ష చేసి రద్దు చేయాలి. హైడ్రా పేరుతో మహానగరంలో చెరువులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం పాలకుల ద్వంద నీతికి నిదర్శనం రాడార్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జరుగబోయే అతి పెద్ద పర్యావరణ విధ్వంసంలో 12లక్షల చెట్లను నరకడానికి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలి అని సోషల్ జస్టిస్ పార్టీ, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
చెన్న శ్రీకాంత్ బిసి
సెల్ 7036988999