- ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు…
- ఎన్డీయే పక్ష సమావేశంలో తీర్మానం..
- ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం లో ఉద్విగ్న వాతావరణం
- ఐదేళ్ల పాటు ఎదుర్కున్న దుర్భర పరిస్థితులపై ఆవేధన వ్యక్తం చేసారు
- మంచి పాలన తో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామని చంద్రబాబు పవన్ పేర్కొన్నారు…
చంద్రబాబు నాయుడును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పవన్.. జనసేన బలపరుస్తోంది అని ప్రకటించారు..
జగన్ వేధింపుల వల్ల చంద్రబాబు నలిగిపోయారు, ఆయనని జైలు లో కలిసినపుడు చాల బాధ అనిపించింది, ఆయన సతీమణి భువనేశ్వరి కి చెప్పాను మళ్ళీ మంచిరోజులు వస్తాయని.. ఇపుడు వచ్చాయి మంచిరోజులు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు సమావేశంలో పాల్గొన్న మూడు పార్టీల నేతలను ఉద్వేగానికి గురిచేసింది..
చంద్రబాబు కూడా పవన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞత పూర్వకంగా పవన్ చేతులు పట్టుకుని నమస్కరించారు.. ఈసారి ఎన్నికలు తెలుగు జాతి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఒక బాధ్యతతో ప్రజలు ఓటు వేయడం చూశానని చంద్రబాబు అన్నారు.
దేశవిదేశాల నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఎన్డీయే పార్టీల గెలుపు కోసం కృషి చేశారని, ఓటు వేయడానికి కూడా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల నుండి ఎంతోమంది ఇక్కడికి వచ్చారని, ఇలాంటి ఎన్నికలు తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని బాబు పేర్కొన్నారు.. ప్రజల ఆకాంక్షలు, మిత్ర పక్షాల అభిప్రాయాలకు అనుగుణంగా బాధ్యతతో ఒక గౌరవం సభ లా శాసన సభ ను నడిపించడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు…