Monday, July 21, 2025
spot_img

మెదడు ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే జీవితానికే ముప్పు!

Must Read
  • వేగంగా మారుతున్న జీవనశైలిలో… మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు!
  • తొలినాళ్ల లక్షణాలే హెచ్చరికలు.. వెంటనే స్పందించాలి : కేర్ వైద్యులు

మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఆలోచనలు, కదలికలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి.. ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలపై అందరూ శ్రద్ధ చూపుతారు కానీ మెదడు ఆరోగ్యాన్ని మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. గంభీర సమస్య వచ్చాక మాత్రమే దీని విలువ గుర్తుకొస్తుంది. జూలై 22న ప్రతి ఏడాది జరుపుకునే వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా, మెదడు సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి, మెదడు ఆరోగ్య పరీక్షలను ప్రాధాన్యతగా తీసుకోవాలని, కేర్ హాస్పిటల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

ఈ సంవత్సరపు థీమ్ “మెదడు ఆరోగ్య సమస్యలు మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు”. దీని ద్వారా ప్రారంభ దశలోనే గుర్తింపు, తగిన చికిత్స, మరియు మెదడు ఆరోగ్యాన్ని నిలబెట్టే జీవనశైలిపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. స్ట్రోక్, ఎపిలెప్సీ, డిమెన్షియా, మల్టిపుల్ స్క్లిరోసిస్, మెదడు క్యాన్సర్ వంటి వ్యాధులు ఇప్పుడు యువతను, వృద్ధులను ఒకేలా ప్రభావితం చేస్తున్నాయి. దీని వెనుక ప్రధానంగా పెరిగిన ఒత్తిడి, కూర్చునే జీవనశైలి మరియు అవగాహన లోపమే ఉన్నాయి.

“మెదడు వ్యాధులు అంటే స్ట్రోక్ లేదా క్యాన్సరే అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం అసలైన మౌన మృత్యుదూతలు.. స్ట్రెస్, మానసిక అలసట, డిజిటల్ ఓవర్‌లోడ్. ఇవి ముఖ్యంగా ఉద్యోగ జీవితం గలవారిని వేధిస్తున్నాయి. ఫోకస్ లోపం, చిరాకు, నిద్రలేమి, మరిచిపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి చిన్న విషయాలు కాదు, ఇవే హెచ్చరికలు. మెదడు ఆరోగ్యం ఒక ఎంపిక కాదు.. అది తప్పనిసరి,” అని కేర్ హాస్పిటల్స్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కైలాస్ మిర్చే తెలిపారు.

ఆధునిక ఉద్యోగాల మానసిక ఒత్తిడికి గురయ్యే వాతావరణం, నిరంతరంగా స్క్రీన్‌లను చూడటం, మానసిక విశ్రాంతి లేకపోవడం మెదడును చెడు దిశలో మలుస్తున్నాయి. “30 ఏళ్లలోపువారిలోనూ మెదడు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కారణం జీవనశైలి, ఒత్తిడి. మంచి మెదడు ఆరోగ్యం అంటే కేవలం వ్యాధుల లేని స్థితి కాదు. దైనందిన జీవితంలో మనసుగా, భావోద్వేగంగా, మేధస్వరూపంగా ఆరోగ్యంగా ఉండడమే” అని డాక్టర్ కైలాస్ మిర్చే చెప్పారు.

సాధారణంగా మెదడుకు మేలు చేసే అలవాట్లలో ప్రతి రోజు 7–8 గంటల నాణ్యమైన నిద్రపోవడం, బీ-విటమిన్లు, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమైనవి. అలాగే, ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వంటి విధానాల ద్వారా ఒత్తిడిని నియంత్రించడం, స్క్రీన్ టైంకు గడులు విధించడం, డిజిటల్ విరామాలు తీసుకోవడం వంటి డిజిటల్ హైజీన్‌ను పాటించడం కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

“టెక్నాలజీ మనకు సాధనం మాత్రమే. అది మన విశ్రాంతికి, అనుబంధానికి ప్రత్యామ్నాయం కాదు. బ్రెయిన్ టెస్టులు, కాగ్నిటివ్ యాప్స్ మంచి పద్ధతులు అయినా, ఎక్కువగా స్క్రీన్ చూసే అలవాటు ఫోకస్‌ను దెబ్బతీస్తోంది,” అని డాక్టర్ కైలాస్ హెచ్చరించారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నపిల్లల స్క్రీన్ టైం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక దశలోనే మెదడు అభివృద్ధి జరుగుతుంది. ఈ దశలో స్క్రీన్ ఎక్కువగా చూసినట్లయితే, పిల్లల్లో భావోద్వేగ నియంత్రణ, దృష్టి వ్యవధి, మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

“మెదడుకు మంచి ఆహారం తీసుకోవాలి. వాల్నట్స్, ఫ్యాటీ ఫిష్, బెర్రీస్, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు మెదడుకు బాగా సహాయపడతాయి. ఇవి జ్ఞాపకశక్తి, మూడ్, లెర్నింగ్ కెపాసిటీకి చాలా అవసరం. మెదడు మంచి పనితీరు చూపాలంటే మంచి ఆహారం ఎంతో అవసరం” అని డాక్టర్ కైలాస్ సూచించారు.

న్యూరో సైన్స్ విభాగంలో అత్యాధునిక సదుపాయాలు, స్ట్రోక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఎపిలెప్సీ మానిటరింగ్, న్యూరో రిహాబిలిటేషన్, నిపుణులచే నిర్వహించబడే శస్త్రచికిత్సలతో కేర్ హాస్పిటల్స్ ముందుంది.

ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా, కేర్ హాస్పిటల్స్, ప్రతి ఒక్కరినీ.. త్వరితంగా ఆలోచించండి, స్పష్టంగా ఆలోచించండి, మెదడును కాపాడుకోండి అని కోరుతోంది.

Latest News

వాన‌ల‌తో.. జ‌ర పైలం

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడండి అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి యూరియా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS