Thursday, March 13, 2025
spot_img

కాప్రా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

Must Read
  • జాడ లేకుండా పోయిన జోనల్‌ కమిషనర్‌..
  • కాంగ్రెస్‌ హయాంలో కానరాని ప్రజా పాలన.. !
  • రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు..
  • వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు..
  • తీసుకున్నది స్టిల్ట్‌ ప్లస్‌ టు పరిమిషన్‌.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు
  • ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు..

కాప్రా జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌. కార్పొరేటర్‌ పార్టీ ఆఫీస్‌ గా మారింది. మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా సదరు కార్పొరేటర్‌ ఓ అక్రమ నిర్మాణదారుడికి వత్తాసు పలుకుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.. ఆ అక్రమ నిర్మాణదారుడు చేసిన పనికి, ఓల్డ్‌ మీర్‌ పేట్‌, శివ హోటల్‌ ఎదురుగా సాయి గార్డన్‌ వద్ద మహిళలు ఆందోళన చేపట్టాల్సిన దుర్గతి పట్టింది.. వివరాల్లోకి వెళ్తే.. వీధి దీపం తొలగిస్తే సహించేది లేదు.. అంటూ ఒక అక్రమ నిర్మాణం వద్ద కాలనీవాసులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది.. కాప్రా జిహెచ్‌ఎంసి పరిధిలోని శివ హోటల్‌ ఎదురుగా ఉన్న కాలనీలో స్టిల్ట్‌ ప్లస్‌ టు అనుమతులు తీసుకొని అక్రమంగా ఐదు అంతస్తుల భవన నిర్మాణం కావిస్తూ పక్కనే ఉన్న స్ట్రీట్‌ లైట్‌ ని కనిపించకుండా గోడ కట్టేశాడు ఆ నిర్మాణదారుడు..

ఈ విషయంపై స్థానిక జిహెచ్‌ఎంసి కార్యాలయంలో కాలనీవాసులంతా కలిసి ఫిర్యాదు చేశారు. కాగా అక్కడే తిష్ట వేసిన కార్పొరేటర్‌ ఇదంతా మామూలే.. అటు వైపు ఎవరూ వెళ్ళకూడదు అంటూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను హెచ్చరించాడు.. ఇక చేసేదేం లేక భవన నిర్మాణం వద్ద కాలనీ మహిళలంతా కలిసి ధర్నా చేశారు..

టోల్‌ ప్లానింగ్‌ లో ఆ కార్పోరేటర్‌ దే హవా :
పేరుకు మాత్రమే జిహెచ్‌ఎంసి.. అందులో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి ఏమీ చెయ్యలేక తమలో తాము కుమిలిపోతూ ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలియవచ్చింది..

జోనల్‌ కమిషనర్‌ ఎక్కడ..?
స్థానిక జీహెచ్‌ఎంసి అదికాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై.. అసలు జోనల్‌ కమిషనర్‌ ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ మహిళలు ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు జోనల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.. రక్షణ కల్పిస్తున్నాం.. అంటూ కోతలు కోయడమే తప్ప చేసేదేమీ లేదు అని వారు వాపోయారు..

ఈరోజు కాలనీలో అక్రమ నిర్మాణానికి అడ్డుగా ఉందని వీధి దీపం తొలగిస్తే.. అర్ధరాత్రి ఆడబిడ్డలు బయటికి ఎలా వస్తారు..? అని వారు ప్రశ్నించారు. మరి సదరు అధికారులు గానీ, కాంగ్రెస్‌ పార్టీ స్థానిక లీడర్లు గానీ వారికి సమాధానం చెప్పగలరా..?

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS