- ఫైనల్ ఎల్పీ నెంబర్ అప్లై చేసుకోకుండా,వెంచర్ డెవలప్మెంట్ చేయకుండానే
మార్ట్ గేజ్ ప్లాట్లు అమ్మేసి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వైనం - హైదరాబాద్ లోని హబ్సిగూడ కేంద్రంగా కోట్లలో బిజినెస్
- మ్యానేజింగ్ డైరెక్టర్ గా చలామణి అవుతూన్నా బచ్చు కిషన్
- బచ్చు కిషన్ తో చేయి కలిపి డబ్బులు దండుకోవడానికి సహకరిస్తున్న
భాస్కర్ రెడ్డి, కల్కి ముత్యం - వీరి దందాకు అధికారుల నుండి ఫుల్ సపోర్ట్
- అసలు మ్యానేజింగ్ డైరెక్టరైనా బచ్చు లావణ్య పాత్ర ఎంత..??
- నెక్సస్ ఎలైట్ డెవలపర్స్” సంస్థ చేస్తున్న అక్రమాలను పై త్వరలో
ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక లో మరిన్ని కథనాలు
హైదరాబాద్ లో జరుగుతున్న మరో కుంభకోణాన్ని ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది.” నెక్సస్ ఎలైట్ డెవలపర్స్” సంస్థ వారు అధికారులతో కుమ్మకాయి వెంచర్ డెవలప్మెంట్ పూర్తిచేయకుండా,ఫైనల్ ఎల్.పీ నెంబర్ అప్లై చేసుకోకుండా మార్ట్ గేజ్ ప్లాట్లు మొత్తం అమ్మేశారు.హైదరాబాద్ లోని హబ్సిగూడ కేంద్రంగా మ్యానేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్,విజయ భాస్కర్ రెడ్డి,కల్కి ముత్యం ఈ కుంభకోణానికి తెరలేపారు.వాస్తవానికి ఈ సంస్థకు మ్యానేజింగ్ డైరెక్టర్ బచ్చు లావణ్య ఉన్నట్టు తేలింది.బచ్చు కిషన్ మ్యానేజింగ్ డైరెక్టర్ గా చలామణి అవుతూ విజయ భాస్కర్ రెడ్డి, కల్కి ముత్యంతో కలిసి ఈ దండకు పాల్పడుతూ కస్టమర్స్ ను మాయమాటలతో తమ వలలో వేసుకొని సుమరుగా కోట్ల రూపాయల వరకు దండుకున్నట్టు సమాచారం. సదరు ఏరియా ఎస్.ఆర్.ఓ. (చేర్యాల), ఏ బేస్ మీద రిజిస్ట్రేషన్ చేశారు..??ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది..?? ఇప్పటి వరకు ఈ సంస్థ అక్రమంగా ఎంత మొత్తంలో దండుకున్నారు..?? మ్యానేజింగ్ డైరెక్టరైనా “బచ్చు లావణ్య” కి తెలిసే ఇదంతా జరిగిందా అనే దాని పై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక మరిన్ని సంచలన విషయాలను త్వరలో బయటపెట్టబోతుంది.