సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బుధవారం పోలీసులు నోటీసులు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ రామ్ గోపాల్ వర్మపై టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్ళి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేశారు. ఈ నెల 19న ముద్దిపాడు పీఎస్ లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.