Tuesday, August 26, 2025
spot_img

మార్చి 24న ఓ భామ అయ్యో రామ’ టీజర్‌ విడుదల..

Must Read

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్ , మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ అందరిని అలరించడానికి సిద్ధమయ్యాడు హీరో సుహాస్‌ ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు,వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ మార్చి 24న ఉదయం 11 గంటల 7నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. దీనికి సంబంధించిన ఓ బ్యూటిఫుల్‌ పోస్టర్‌తో టీజర్‌ అనౌన్స్‌ చేశారు నిర్మాతలు. ఈ బ్యూటిఫుల్‌ పోస్టర్‌ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ ” సుహాస్‌ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది. రాబోయే టీజర్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఓ బెస్ట్‌ క్వాలిటీ సినిమాను అందించబోతున్నాం. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్‌ ఉంటుంది. ఈ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం వుంది. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ బెస్ట్‌ ఎంటర్ టైనర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. సీనియర్ నటి అనితా హసనందిని మరియు ప్రముఖ నటుడు అలి కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది – మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు.

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS