Saturday, April 19, 2025
spot_img

యువత జీవితాన్ని ఛిదిమేస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Must Read
  • ఈజీ మని కోసం బెట్టింగ్‌లను ఆశయ్రిస్తున్న యువత
  • ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఐపీఎల్‌ బెట్టింగ్‌లు
  • ఫేస్‌ బుక్‌ వేధికగా భారీ ప్రమోషన్లు
  • షేర్‌ మార్కెట్‌ పేరుతో భారీగా ప్రమోషన్లు
  • టెలిగ్రామ్‌ వేధికగా విచ్చలవిడిగా గ్రూప్‌లు
  • అప్పుల పాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు
  • అవమానాలు భరించలేక ఆత్మహత్యలు
  • ఎంత నిఘా పెట్టిన కొత్త దారుల్లో సాగుతన్న బెట్టింగ్‌లు

రోజు కష్టపడి పనిచేసినంత డబ్బు మీరు ఒకే గంటలో సంపాదించుకునే అవకాశం.. మీరు పెట్టుబడి పెట్టండి.. మేము మీకు లాభాలు తెచ్చిస్తాం.. వంద రూపాయలకు వెయ్యి రూపాయల లాభం.. మీ ఆర్థిక ఇబ్బందులన్ని వారం పదిరోజుల్లో దూరం అవుతాయి… ఇవి నిత్యం మనకు సోషల్‌ మీడియా వేధికలలో కనిపించే దృశ్యాలు. కాని వీటిని నమ్మితే మనం బెట్టింగ్‌ రాయుళ్ళ చేత్తిలో చిక్కినట్టే అనే విషయం గ్రహించాలి. ఒక్కసారి వారి ఉచ్చులో చిక్కితే ఒక అంతే సంగతులు మనం భయటకు వద్దామన్న రాలేము. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని జెఎన్‌టీయులో ఎంటెక్‌ చదువుతున్న పవన్‌ అనే యువకుడు బెట్టింగ్‌లో లక్ష వరకు పొగొట్టుకుని గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనే ఇందుకు నిదర్శనం.

సామాన్యుని చేతికి స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తరువాత వారికి ఎన్నో ప్రయోజకరమైన విషయాలను తెలియచేయడంతో పాటు చాలా మందిని ప్రమాధకర స్థితిలోకి నెడుతున వైనం. నేడు ప్రపంచ వ్యాప్తంగా కూడా సోషల్‌ మీడియా వేధికగా అనేక కార్యకలాపాలు సాగుతుంటాయి. అయితే వాటిని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సామాన్యులను టార్గెట్‌ చేస్తుంటారు. ఇలాంటి వారి వల్ల సామాన్యులు జాగత్ర వహించకపోతే నిత్యం మన వినియోగించే స్మార్ట్‌ ఫోన్లు మన పాలిట యమపాశలవుతాయనే విషయం గ్రహించాలి. ప్రస్తుతం విదేశాల్లో వుంటూ కూడా మనల్ని చాలా మంది సైబర్‌ నెరగాళ్ళు లేదా ఇతరులు ఏదో విధంగా మనల్ని సులువుగా మోసం చేసే అవకాశాలు వున్నాయి. వారికి కావాల్సింది అంతా మనం ఒక్కసారి మనం వారిని నమ్మడమే. ఇలా సామాన్యులను బుట్టలో వేసుకునేందుకు వారు చేసే అర్బాటాలు,… వారు చెప్పే మాటలు ఇంతా అంతా కాదు. మనల్ని బురిడీ కొట్టించేందుకు వారు అనేక మాయమాటలు చెబుతారు. ఇలా వారు చెప్పిన మాటలు విని మనం ఒక్కసారి వారి ట్రాప్‌లో పడామంటే చాలు ఇక మన ఇళ్లు వాకిలితో పాటు మనల్ని సర్వం కోల్పోయే వరకు భయటకు రాలేము. ఇందుకు కోసం వారు మనకు వేసే గాలం ఈజీ మని అస్త్రాం. ఇది వారికి బ్రహ్మస్త్రం అయితే మనకు యముని ఆస్త్రమనే చెప్పాలి. వారి పని అయిపోయిన తరువాత మనం వారిని సంప్రదించేందుక ప్రయత్నించిన వారు మనకు కనబడారు.

వాట్సప్‌, ఫేస్‌ బుక్‌, టెలిగ్రామ్‌ వేధికలుగా,…
సామాన్యులను తమ ఉచ్చులో పడేసేందుకు ఇలాంటి నేరగాళ్ళు వాడుకునే అస్త్రాలే వాట్సప్‌, ఫేస్‌ బుక్‌, టెలిగ్రామ్‌ యాప్‌లు అయితే ఇందులో ఎక్కువగా టెలిగ్రామ్‌, ఫేస్‌ బుక్‌ యాప్‌లలను ఈ బెట్టింగ్‌ రాయుళ్ళు వాడుతుండడం గమనార్హం. టెలిగ్రామ్‌లలో అయితే విచ్చలవిడిగా వీటికి సంబందించిన గ్రూప్‌లు అందుబాటులో వున్నాయి. ఫేస్‌బుక్‌లలో వీటికి సంబందించిన లింక్‌లను పెడుతూ వారి యాప్‌లను ప్రమోట్‌ చేస్తుంటారు. ఇందులో మనకు వారు చూపించే ఆశనే ఈజీ మని. తక్కువ పెట్టుబడితో.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే తమను సంప్రదించాలని ఫేస్‌ బుక్‌లలో చాలా కోని వేల యాప్‌లకు సంబందించిన లింక్‌లు అందుబాటులో వున్నాయి. ఒక్కసారి ఆ లింక్‌లను ఓపెన్‌ చేసి మనం ఆ గ్రూప్‌లలోకి వెళ్ళామంటే చాలా అందులో వున్న సభ్యులు మనల్ని మరిన్ని గ్రూప్‌లలో యాడ్‌ చేస్తునే వుంటారు. మనకు కొత్త నెంబర్ల నుండి ఫోన్లు రావడంతో పాటు చాటింగ్‌లు చేస్తునే వుంటారు.

షేర్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు, నష్టాలు,…
టెలిగ్రామ్‌, ఫేస్‌ బుక్‌లలో ఎక్కువగా మనకు కనిపించేవి షేర్‌ మార్కెట్‌కు సంబందించిన యాప్‌లకు సంబందించిన లింక్‌లు. వీటిల్లో మీరు రోజుకు కేవలం గంట సేపు పనిచేసి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చని అందుకు మేము కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అకర్షిణీయమైన విడియోలు కనిపిస్తుంటాయి. వాటిని నమ్మి మనం ఒక్కసారి వారి ఉచ్చులో పడితే చాలా మన నుండి డబ్బులు లాగేసేందుకు వారి వద్ద అనేక ఆస్త్రాలు వుంటాయి. మనకు తెలియకుండానే మన డబ్బులు పెట్టుబడిగా వారు లాభాలు ఆర్జించడమే కాకుండా మనల్ని మాత్రం నష్టాల ఊభిలోకి నెట్టేస్తారు. అందుకు ముందుగా వారు మనకు కూడా లాభాలను చూపిస్తారు. ఒకసారి రెండు సార్లు మనకు లాభాలు వచ్చే సరికి మనకు మరింత డబ్బు ఆశ చూపి మనతో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన తరువాత అసలు కథ మొదలవుతుంది. నెమ్మదిగా మనకు నష్టాలు రావడం మొదలవుతాయి. నష్టాలను రాబట్టుకునేందుకు మనం మరింత డబ్బులు పెడుతూ పోతూ వుంటాం,… అలా చివరకు మన ఖాతాల్లోని డబ్బులు ఖాళీ కావడమే కాకుండా అపులు చేసి, లేదా అస్థులను అమ్మి ఇలా షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టిన వారు చాలా మంది వున్నారు. చివరకు ఉన్న డబ్బులు పోయి అస్తులు పోయి అప్పుల పాలైన మనం రోడ్డు మీదకు రావడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని రోడ్డున నిలబెటాల్సిన దుస్థితికి తీసుకువస్తారు. దీంతో చేసేది లేక అప్పులు కట్టే మార్గాలు లేక ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి మనల్ని తీసుకురావడం జరుగుతుంది.

బెట్టింగ్‌ యాప్‌లు,….
అదేవిధంగా ఇటీవల కొంతకాలంగా చాలా మంది ఫోన్‌లలో వచ్చే వివిధ రకాల గేమింగ్‌ యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కూడా చాలా మంది డబ్బులు పెట్టి అడడం మనం రోజువారిగా చూస్తునే వున్నాం. ఇది కూడా ఓ రకమైన ట్రాప్‌ అనే చెప్పాలి. ముందుగా మనకు లాభాలు చూపించి తరువాత మనల్ని ఆ యాప్‌లకు అలవాటుపడేలా చేస్తారు. తరువాత నెమ్మదిగా మన ఆట మొత్తం వారి చేతిల్లోకి వెళిపోతుంది. ముఖ్యంగా లూడో, వివిధ రకాల పేకాటలకు సంబందించిన యాప్‌, తదితర యాప్‌లు ప్లేస్టోర్‌లో చాలానే వున్నాయి. ఇలాంటి యాప్‌ల వల్ల కూడా ఇళ్లు గుళ్ళ అవుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఐపీఎల్‌ నడుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో గుట్టుచపుడు కాకుండ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వివిధ టీంలు అడే క్రమంలో లక్షల్లో బెట్టింగ్‌లు కడుతుంటారు.

ఆగని బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్స్‌,…
బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న కొందరు సెలబ్రెటీలపై తెలంగాణ పోలీసులు ఫోకస్‌ చేయడంతో వారం రోజుల పాటు హడావుడి నడిచింది. బెట్టింగ్‌ యాప్‌ల నిర్వహకులపైనా చర్యలు ఉంటాయని అంతా భావించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం దీని పై సీరియస్‌గా స్పందిస్తూ బెట్టింగ్‌ యాప్‌ల పై కఠినంగా వ్యవహరించాలని అదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో బెట్టింగ్‌ యాప్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారని, దాదాపు యాప్‌లన్నీ మూసుకుపోతాయని ఓ చర్చ బలంగా జరిగింది. కానీ రోజులు గడుస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లలో రోజుకు వేల కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కొత్త యాప్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. చాపకింద నీరులా బెట్టంగ్‌ యాప్స్‌ ప్రమోషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు సెలబ్రెటీలు ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాద్యమాల ద్వారా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయగా తాజాగా టెలిగ్రామ్‌ ద్వారా ఈ యాప్‌లను విస్తృతంగా ప్రమోట్‌ చేస్తున్నారు. మ్యాచ్‌ ప్రిడక్షన్‌ పేరుతో బెట్టింగ్‌ వైపు ఆకర్షస్తున్నారు. ఇటువంటి వారిపై కూడా పోలీసులు ఫోకస్‌ చేయాలని, క్రికెట్‌ అనలిస్టుల పేరుతో టెలిగ్రామ్‌ ఛానల్స్‌లో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు చాలమంది.

అసలు వారి ధైర్యం ఏంటీ ?
కొందరు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌లో భాగంగా తమ్మదే నమ్మకమైన యాప్‌ అని, లోకల్‌ బుకీల దగ్గర ఆడితే పోలీసులు పట్టుకుంటున్నారని, తాము చెబుతున్న యాప్‌ లీగల్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. బెట్టింగ్‌ యాప్‌లు విదేశాల నుంచి ఆపరేట్‌ అవుతున్నాయని, పోలీసులు ఏమి చేయలేరని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. వందలకొద్ది యాప్‌లు విదేశాల నుంచి ఆపరేట్‌ చేస్తున్నప్పటికీ వాటి ప్రమోషన్స్‌ మాత్రం దేశంలోనే జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కొందరు కొన్ని సంస్థల వద్ద మొబైల్‌ నెంబర్స్‌ సేకరించి కాల్స్‌ సెంటర్స్‌ నుంచి కాల్‌ చేస్తూ ఆన్‌లైన్‌ గేమింగ్స్‌ ఆడే అలవాటు ఉందా అంటూ తమ యాప్‌ను పరిచయం చేస్తున్నారు. తమయాప్‌లో విన్నింగ్‌ ఛాన్సెస్‌ ఎక్కువని, ఈ యాప్‌లో ట్రై చేయండంటూ కాల్‌ సెంటర్స్‌ నంచి కాల్స్‌ చేస్తున్నారు. విదేశాల నుంచి యాప్స్‌ను ఆపరేట్‌ చేస్తుండటంతో ఆ యాప్‌ అసలు నిర్వహకులు ఎవరనే విషయం బహిర్గతం అయ్యే అవకాశాలు తక్కువ. పోలీసులు సైతం ఈ యాప్స్‌ను కట్టడి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారనేది అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేళ ప్రతిరోజూ కోట్ల రూపాయిలు ఆన్‌లైన్‌ బెట్టంగ్‌ నడుస్తోంది. పోలీసులు తమపై కూడా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో ప్రస్తుతం యాప్‌లలో డబ్బులు నష్టపోతున్న వారు బయటకు రావడం లేదు. యాప్‌ ప్రమోటర్లతో పాటు నిర్వహకులపై చర్యలు తీసుకుంటేనే ఈ గ్యాంబ్లింగ్‌ యాప్స్‌ను నియంత్రించవచ్చనే చర్చ జరుగుతోంది.

మొత్తం మీద బెట్టింగ్‌ యాప్‌లను నియంత్రించేందుకు ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం లేకుండా పోతుంది. ఎప్పటికపుడు కొత్త ఒరవడితో నూతన ఉత్సాహంతో బెట్టింగ్‌లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. రోజురోజుకు బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్లు ఎక్కువ కావడంతో యువత పెడదారి పట్టి ఈజి మనికి అలవాటు పడి చాలా మంది యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరి దీనికి అడ్డుకట్ట ఎప్పటికీ పడుతుందో వేచి చూడాల్సిందే.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS