- 100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు
- దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నేషనల్ స్కిల్ అకాడమీ
భారతదేశపు స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకొని 100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో 85% ఫీజు రాయితీ తో ఆన్ లైన్ ద్వారా శిక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకట రెడ్డి తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న మరియు పూర్తి చేసిన విద్యార్థులకు సరికొత్త కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెరుగైన ఉద్యోగాల కోసం దేశ విదేశాలలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించేందుకు ప్రతి ఒక్క విద్యార్ధి నేర్చుకోవాల్సిన 100 కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏ కోర్సు అయినా ఎంపిక చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, పీజీ డిప్లొమా ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ తో పాటు 100 కి పైగా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులు వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, మరియు బిజినెస్ అనలిటిక్స్ , దేవోప్స్ ఇంజనీరింగ్ , ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్,సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇంజినీరింగ్, ఆర్ ప్రోగ్రామింగ్, డీప్ లెర్నింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, పవర్-బిఐ , గేమ్ డెవలపింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్ చైన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా ప్రోగ్రామింగ్, ఒరాకిల్, మినిటాబ్, లైనక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , ఎజైల్, నెట్వర్క్ మరియు సెక్యూరిటీ, సెలీనియం, సాస్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్, సోషల్ మీడియా మార్కింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి 100 కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుందన్నారు. తర్వాత పరీక్షలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. విజయవంతమైన అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 10 నెలలు వరకు ఉంటుంది, వివిధ సాఫ్ట్‌వేర్ సబ్జెక్ట్‌లో ఇన్ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి ఫీజులో రాయితీ లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు, మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 85% ఫీజు తగ్గింపునకు అర్హులు.
ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న, పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు
www.nationalskillacademy.in వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 9505800050, 9505800047 ఫోన్ నంబర్‌లపై సంప్రదించాలని కోరారు.