Thursday, March 13, 2025
spot_img

అంగరంగ వైభవంగా ఆస్కార్‌ పండగ

Must Read
  • ఆనోరా మూవీకి అవార్డ్‌ల‌ పంట
  • అన్ని విభాగాల్లోనూ ఉత్తమ చిత్రంగా ఎంపిక

యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ’అనోరా’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ’ది బ్రూటలిస్ట్‌’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ.. ’అనోరా’లో నటనకు మైకీ మ్యాడిసన్‌ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. సీన్‌ బేకర్‌ (అనోరా) ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ’ఎ రియల్‌ పెయిన్‌’ చిత్రానికి కీరన్‌ కైల్‌ కల్కిన్‌ ఉత్తమ సహాయ నటుడిగా.. ’ఎమిలియా పెరెజ్‌’లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన ’డ్యూన్‌: పార్ట్‌2’ ఉత్తమ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇక లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్‌లో నిలిచిన ’అనూజ’ చిత్రానికి మాత్రం నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో ’ఐయామ్‌ నాట్‌ ఏ రోబో’ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది. లాస్‌ ఏంజెలెస్‌ డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

నటీమణులు ఫ్యాషన్‌ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆస్కార్‌ అవార్డుల వేడుకకు వచ్చిన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోª`డలెన్‌బర్గ్‌ చిట్‌చాట్‌ చేశారు. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్‌, లిసా, క్వీన్‌ లతీఫా, రేయ్‌లు తమ ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్‌ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ నటుడు, ఆర్టిస్ట్‌, టెక్నీషన్‌ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో గల డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా సాగింది. ఈ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్స్‌ హాజరయ్యారు.

ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం బెస్ట్‌ పిక్చర్‌తో ముగిసింది.ఇక అనోరా కథ విషయానికొస్తే.. ఇదో వేశ్య కథ. రొమాంటిక్‌ కామెడీ డ్రామా నేపథ్యంలోనే దీన్ని తెరకెక్కించారు. రష్యాకి చెందిన కోటీశ్వరుడైన కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు. అక్కడ 23 ఏళ్ల వేశ్యని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. పెళ్లికూడా చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కుర్రాడి తల్లిదండ్రులు.. ఈ పెళ్లిని అంగీకరించరు. తమ కుమారుడిని రష్యాకు తీసుకెళ్లి పోతారు. దీంతో వేశ్య ఏం చేసింది..? అతడిని వదిలేస్తుందా..? అనేది మిగతా స్టోరీ. సుమారు 6 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.52 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఊహించని రీతిలో 41 మిలియన్‌ డాలర్లు అందుకుని కలెక్షన్లలో రికార్డులు సృష్టించిందీ చిత్రం. ఇక విడుదలకు ముందే ఈ చిత్రం పలు అవార్డులు, రివార్డులు అందుకుంది. 2024 మేలో జరిగిన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు కేన్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ’పామ్‌ డి ఓర్‌’ అవార్డును సీన్‌ బేకర్‌ అందుకున్నారు. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా-2024లో కూడా అనోరా చోటు దక్కించుకోవడం విశేషం. రెండు బ్రిటిష్‌ అకాడవిూ ఫిల్మ్‌ అవార్డ్స్‌నూ అందుకుంది. ఇప్పుడు ఆస్కార్‌ వేడుకల్లో సత్తా చాటి.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS