ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. సంగారెడ్డి జిల్లా మహదేవ్ పల్లి పంచాయితీ సెక్రటరీ ఉమేష్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాసన్పల్లి కి చెందిన బాధితుడు నో డ్యూస్ సర్టిఫికెట్ విషయంలో ఉమేష్ ను సంప్రదించాడు. నో డ్యూస్ సరిఫికేట్ కావాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని పంచాయితీ సెక్రటరీ ఉమేష్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.