Sunday, March 16, 2025
spot_img

11 ఏండ్ల పోరాటం..11స్థానాలకు వారిని పరిమితం చేశాం

Must Read
  • అసెంబ్లీ గేటును తాకనీయమన్నారు…
  • వందశాతం స్ట్ర‌యిక్ రేటుతో సాధించి చూపాం
  • ఎన్నికల్లో ఓడినా అడుగు ముందే వేసి చూపాం
  • మనం నిలబద్దం..టిడిపిని నిలబెట్టాం
  • జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం

జనసేన 11 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్ని.. ఎన్నో కష్నష్టాలను ఓర్చుకుని..వేధింపులను తట్టుకుని… అరాచక పార్టీని అధికారం నుంచి దింపడమే కాదు… 11 సీట్లకే పరిమితం చేశామని జనసేనాని, డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమని చెప్పిన వారిని అధికారానికి దూరం చేశామని అన్నారు. ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని, ఎన్నికల్లో విజయం సాధించామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు విూసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు. మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్‌ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం సట్రయిక్‌ రేట్‌ సాధించాం అంటే అది జనసేన పవర్‌ అని అన్నారు. భయం లేదు కాబట్టే ఇంత దూరం వచ్చా. గుండె ధైర్యమే కవచం‘ అని పవన్‌ వివరించారు. ‘జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్‌. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్యుల కవిత్వంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించడమే గాకుండా దేశం కోసం నిలబడతామని ప్రకటించారు.. కరెంట్‌ షాక్‌ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశాం. బహు భాషలే భారతదేశానికి మంచిదని ప్రకటించారు.

త‌మిళనాడు సహా అన్ని రాష్ట్రాల‌కు ఒకే సిద్దాంతం ఉండాలి. జనసేన సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే.. ఇక్కడున్న జనసైనికులంతా ప్రాణాలకు తెగించి వచ్చారు. 450 మంది జనసైనికులు సినిమాలను కాదు.. సిద్దాంతాలను నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం ఇక్కడ సినిమాల గురించి మాట్లాడవద్దని చెబుతున్నని అభిమానులను సుతిమెత్తగా వారించారు. అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లు పార్టీని నడిపా. మన పార్టీకి 11వ సంవత్సరం.. వాళ్లను 11 సీట్లకు పరిమితం చేశాం. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే. ఖుషీ సినిమా చూసి గద్దరన్న నన్ను ప్రోత్సహించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక. చంటి సినిమాలో విూనాను పెంచినట్టు నన్ను పెంచారు. అలాంటి నేను సినిమాలు చేస్తానని, రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ ఊహించి ఉండరు. నేను డిగ్రీ పూర్తి చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనే వారు. బయటకు వెళ్తే ఏమవుతానో అని మా ఇంట్లో నిత్యం భయపడేవారని పవన్‌ అన్నారు.

జనసేన వంద శాతం స్ట్ర‌యిక్ రేట్‌ సాధించిందంటే.. అందుకు ఏడు సిద్దాంతాలే కారణం. ఎంతో ఆలోచించి ఏడు సిద్దాంతాలు పెట్టాం. సినిమాల్లోనూ దేశ భక్తి ఉండాలని తపించేవాడిని. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యిండాలా? బాబాయిని చంపించి ఉండాలి అని ఎక్కడా రాసిలేదు కదా? దశాబ్దం పాటు పార్టీని నడిపానంటే.. వ్యక్తిగత జీవితం నుంచి ఆరోగ్యం వరకు ఎంతో కోల్పోయా. అయినా.. ఈ జయకేతనం సంతృప్తి నిచ్చింది. సమాజంలో మార్పు కోసం వచ్చా.. ఓట్ల కోసం కాదు. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడమే నా ఐడియాలజీ అని భావోద్వేగంతో అన్నారు. వ్యక్తిగా ఎదగాలి, అధికారమే ముఖ్యం.. దాని కోసం గూండాలను వాడుకుంటాం.. హత్యలు చేయిస్తాం. రూ.వేల కోట్లు దోచేస్తాం. కులాల మధ్య చిచ్చు పెడతాం.. కోడికత్తిని వాడుకుంటాం. తద్వారా లాభపడతామన్నది ఇంకో పద్ధతి. నేను అలాంటివి ఎంచుకోలేదు. సైద్దాంతిక విధానాన్నే ఎంచుకున్నా. ఎంత పోరాటం చేస్తే ఇక్కడికి వచ్చాం.. అర్థం చేసుకోవాలి. బలమైన దేశం కావాలంటే.. బలమైన ప్రజలు ఉండాలి. దేశం కోసం బలంగా నిలబడే యువత ఉంటేనే దేశం మారుతుంది. భవిష్యత్తును నిర్మించే యువ నాయకత్వం రావాలి. భవిష్యత్తుకు దిశా నిర్దేశర చేయాల్సిన సమయం. సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది.. నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే దేశం కోసం నిలబడే యువత రావాలి అన్నారు. తెలుగు రాష్ట్రాల‌ నుంచి కనీసం వందమందిని ఎంపిక చేసి దేశం కోసం తయారు చేస్తామని అన్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంగా, ఉత్తేజపూరితంగా, దేశం కోసం తానో సైనికుడిని అన్న తీరుగా సాగింది. ఓ రకంగా చెప్పాలంటే జనసేన జయకేతనం సభలో పవన్‌ కల్యాణ్‌ గర్జించారు. నిర్భంధాలను చిత్తు చేసి.. అధికార పీఠం ఎక్కిన తీరును ప్రస్తావించారు. అన్యాయాన్ని, అక్రమాలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని ఉద్ఘాటించారు.

పవన్‌ తన ప్రసంగం ప్రారంభిస్తూ.. ఎంతో స్ఫూర్తిదాయకమైన పాటను ప్రస్తావించారు. అచ్చమిల్లై.. అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడారు. భయం లేదు.. భయం లేదు.. అంటూ తన ధైర్యానికి కారణాన్ని పేర్కొన్నారు జనసేనాని. ఇల్లేమో దూరం.. చేతిలో దీపం లేదు.. గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే.. అన్నీ ఒక్కడినే అయి.. 2014 లో జనసేన పార్టీ స్థాపించాను. భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాను. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం అన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమంగా జైలులో బంధించారు. వారి పార్టీ సీనియర్‌ నాయకులను రోడ్డు విూద రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడిపై చేయని కుట్ర లేదు, తిట్టని తిట్టు లేదు, వేయని నిందలు లేవు. ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్‌ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా ఘన విజయం సాధించాం. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం. అలాగే తెలంగాణపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మ స్థలం తెలంగాణ అయ్యింది.. కర్మ స్థలం ఆంధప్రదేశ్‌ అయ్యింది. కృష్ణమాచార్య మాటలు.. మాకే కాదు.. మన ప్రజలకు ఊతమిచ్చాయి. నా గుండె లోత్తుల్లో నుంచి విూ అందరికీ ధన్యవాదాలు. మూగబోయిన కోటి మంది తమ్ముళ్ల గళాన్ని వినిపించిన నా తెలంగాణా కోటి రతనాల వీణ. అలాంటి కోటి ధివిటీల కాంతి జ్యోతి తెలంగాణా. ఆనాడు కరెంటు షాక్‌ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాకు చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి ఆశీస్సులు.. నన్ను ప్రేమించే ప్రజల దీవెన నాకు ఊపిరి ఇచ్చింది. అలాంటి తెలంగాణ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బండెనక గట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ కాళ్లకు గజ్జె కట్టి.. చేతికి కర్ర పెట్టి.. ఆటని, పాటని ఆయుధంగా మలిచిన వాడు.. యువతలో స్పూర్తిని నింపినవాడు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే.. మన దగ్గర లేని నా గద్దరన్న. మా ఆడపడుచులు, వీర మహిళల స్పూర్తి, పోరాటాన్ని నేను మరువను. విూరంతా రాణి రుద్రమలు.. జనసేన వీరమహిళలు.. అందరి క్షేమం కాంక్షించే సూర్య కిరణాల లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్‌ భీమ్‌లు.. మా జనసేన వీర మహిళలు అంటూ తన ప్రసంగంలో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ నింపారు పవన్‌ కల్యాణ్‌.

తన ప్రసంగం సందర్భంగా పవన్‌ కల్యాన్‌ భారత్‌ మాతాకీ జై అని నినదించారు. నేడు హెలీ పండుగ.. మైత్రిని పంచే పండుగ. చెడు పోయింది.. మంచి వచ్చింది అని ఉత్సవం చేసే పండుగ. మన జయకేతనం ఎగుర వేసిన రోజు.. హెలీ రావడం యాధృచ్చికం కాదు.. భగవంతుని నిర్ణయం. తమిళనాడు షణ్ముఖ్‌ యాత్రకు వెళితే.. నాపై ఎంతో ప్రేమ చూపించారు. తమిళనాడు ప్రజలందరికీ మనస్పూర్తిగా నా నమస్కారాలు. మహారాష్ట్ర వెళితే.. సినిమా పరంగా కాకుండా రాజకీయ పరంగా కూడా నాపై అబిమానం చూపారు. ఎన్డీయే కూటమి కోసం అక్కడ ప్రచారం చేయగా.. 95శాతం విజయం సాధించాం. కర్నాటకలో కూడా నా విూద ప్రేమ చూపించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. బహుభాషా ప్రావీణ్యం ఎంతో మంచిది అన్న పవన్‌.. భారత్‌ మాతాకీ జై అని నినదించారు. 2009 లో ప్రజారాజ్యంతో నా రాజకీయం ప్రారంభమైంది. కానీ 2003 లో నా తండ్రికి చెప్పా.. నేను రాజకీయాల్లోకి వస్తా అని. నేను సమాజం విూద బాధ్యతతో ఆలోచించా. సినిమాల పరంగా ఎదగాలని అనుకోలేదు. నా ఖుషీ సినిమా చూసి.. గద్దర్‌ మా అన్నయ్యల ద్వారా నన్ను కలిశారు. ఏ మేరా జహా అనే పాటలో నా సీన్స్‌ చూసి.. నన్ను గద్దర్‌ అభినందించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. 2006 లో ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్‌ వచ్చి రాజకీయాల్లోకి వస్తారా అని నన్ను అడిగారు. నాకు అప్పుడు రాజకీయాలపై అవగాహన లేదని, మెచ్యూరిటీ వచ్చాక వచ్చి కలుస్తా అని చెప్పాను. ఆ వ్యక్తిని ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఆయనే ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు గారు. నన్ను సినిమాల్లో చూసి ఓజీ అంటున్నారు. నేను సమాజం కోసం ఆలోచన చేసే ఇటువంటి వారిని చూస్తాను. అణగారిన వర్గాల కోసం పని చేసే వ్యక్తి మన ప్రొఫెసర్‌ గారు. నా గుండెల నుంచి ప్రొఫెసర్‌ గారికి ప్రేమను మాత్రం ఇవ్వగలను.. అంటూ సన్మానించిన పవన్‌ కళ్యాణ్‌. 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఒక్కడినే.. ఈ 11 యేళ్లల్లో నేను పడ్డ కష్టాలు, బాధలు ఏమిటో కొంతైనా విూతో పంచుకుంటాను. విూ అందరినీ గుండెల్లో పెట్టుకున్నాను.. విూరే నా కుటుంబం అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Latest News

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి

లొంగిపోయిన 64మంది మావోయిస్టులు ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS