- హిందూ ధర్మ పరిరక్షణ బాద్యత అందరిపై ఉంది
- హిందువులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల
- తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మరెడ్డె కారణం
- లడ్డూ వివాదంకి ప్రకాష్ రాజ్‌కి ఏం సంబంధం
- ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు
తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడి మెట్లను స్వయంగా పవన్‌కళ్యాణ్ పసుపు నీళ్ళతో శుద్ధి చేశారు.మెట్లకు పసుపు,కుంకుమ బొట్లు పెట్టి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,హిందూ ధర్మం జోలికి ఎవరు రావొద్దు అని,హిందూ ధర్మ పరిరక్షణ బాద్యత అందరిపై ఉందని తెలిపారు. హిందువుల ఆలయాలపై,హిందువులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల అని ప్రశ్నించారు. మసీదుల్లో,చర్చిలలో ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని మండిపడ్డారు.
తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మరెడ్డె కారణమని విమర్శించారు. ఈ వివాదంపై ప్రకాష్ రాజ్‌కి ఏం సంబంధం ఉందని,ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకేనేది లేదన్నారు. వైసీపీ నాయకులు కూడా తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని,వారు చేస్తున్న విమర్శలను సహిస్తున్నాని,కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమలను,పర్యాటక కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.