Friday, November 22, 2024
spot_img

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయాలి

Must Read
  • ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్

పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్‎మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సంధర్బంగా కార్తీక్ మాట్లాడుతూ, రావుల రాజ్యం పోయి, రెడ్డిల రాజ్యం వచ్చింది కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఎక్కడవేసిన గొంగడిలా అక్కడే పడిందని వ్యాఖ్యనించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయడం లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుందని, గత ప్రభుత్వాన్ని గద్దె దింపిన చరిత్ర ఏబీవీపీకి ఉందని అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వానికి బుద్దిచెబుతామని హెచ్చరించారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS