- తోటి ఉద్యోగినిపై అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ కామవాంచ
- జనవరి 30న ప్లేట్ల బుర్జు దావఖానాలో కామపిశాచి శీర్షికతో ఆదాబ్ లో కథనం
- వెంటనే స్పందించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
- ఐదుగురితో హై లెవెల్ కమిటీ ఏర్పాటు.. వాస్తవమేనని తేల్చిన కమిటీ
- ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈకి రిపోర్ట్ అందజేసిన హై లెవెల్ కమిటీ
- నెల రోజులు పూరైన కామ పిశాచిపై చర్యలు శూన్యం…
- దర్జాగా డ్యూటీ చేస్తూ తిరుగుతున్న షకీల్ హసన్
- అండగా ఆస్పత్రి సూపరింటెండెంట్.. పట్టించుకోని డీఎంఈ
- ఓ మహిళకు అన్యాయం జరిగితే ఇంత చులకనా.!
- షకీల్ హాసన్ ఖాన్ పై చర్యలకు బాధితురాలు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఏ డిపార్ట్ మెంట్‌లో చూసిన మహిళ ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదు. తోటి ఉద్యోగినీలను మానసికంగా, శారీరకంగా టార్చర్ పెడుతున్నారు. మరికొందరైతే కామ కోరికలు తీర్చా లంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉద్యోగరిత్యా లేదా కుటుంబ పరువు విషయంలో ఆడవారు బయటపెట్టడం లేదు. కానీ, ఇందులో శృతి మించడంతో ఏదో ఒకచోట ఒకటి, రెండు కేసులు బయటకొస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణలో ప్రసూతి ఆస్పతులలో అతి పెద్దైన ప్లేట్ల బుర్జులో అసిస్టెంట్ డైరెక్టర్ కొలువు వెలగబెడుతున్న షకీల్ హాసన్ ఖాన్ తోటి ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నాడు. రిటైర్డ్ వయసుకు వచ్చింది, పెన్షన్ ఎత్తుకొని ఇంట్లో గడపాల్సిన ఖాన్ సాబ్ పోయేకాలానికి ఈ పాడు బుద్ధి ఏంటో.. బిడ్డా, మనువరాలు ఏజ్ ఉన్న ఆడవారిపై మనసు పారేసుకుంటున్నా డు. ఓ దళిత ఉద్యోగిని పలుమార్లు తన కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. పెద్దాఫీసరు కదా, బయటచెబితే ప్రాబ్లం అవుతుందని పాపం ఆ స్త్రీ భరించింది.. కానీ, కామపిశాచి అతిచేస్తుండడంతో తనఘోడు వెళ్లబోసుకుంది.
ఈ నేపథ్యంలోనే జనవరి 30వ తేదీన ‘ప్లేట్ల బుర్జు దావఖానాలో కామపిశాచి’ శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ లో కథనం ప్రచురించింది. అప్పట్లో ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా తెగ వైరల్ అయింది. కాగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దీనిపై స్పందించారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న ప్లేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న షకీల్ హసన్ ఖాన్ పై ఎంక్వైరీ చేయాలని వెంటనే ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఐదుగురితో హై లెవల్ కమిటీ వేశారు. రంగంలోకి దిగిన వైద్యశాఖ బృందం ప్లేట్ల బుర్జు దావఖానాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న షకీల్ హాసన్ ఖాన్ పై ఆరా తీసింది. లక్షల్లో జీతం తీసుకుంటూ తను చేస్తు న్నది ఏం లేదు. హాస్పిటల్ లో ఏం పనిలేని పెద్దాయనకు ఎప్పుడూ నీచమైన ఆలోచనే.
ఆస్పత్రిలో డ్యూటీ చేసే నర్సులు, డాక్టర్లు, అడ్మిన్ విభాగంలో పనిచేసే వారిపై కన్నుపడితే ఏదో రకంగా తనతో బెడ్ షేర్ చేసుకోమంటాడు. హోటల్, రూమ్ కు పిలిపించుకొని శారీరక కోరిక తీర్చుకోవడమే కామ పిశాచి ఆశయం. తన లైంగిక వాంఛలు తీర్చాల్సిందేనంటూ ఆ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాడు. అంతేకాకుండా అంగీకరించని ఉద్యోగనులను 14 రోజులలో 3 సెక్షన్‌లను సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు రెండు సెక్షన్లను మార్చాడంటే అతగాడీ వాంఛ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా అతికొద్ది కాలంలోనే 5సార్లు సెక్షన్లు మార్చడం ఏ శాఖలోనూ లేదు.. ఏదైనా సెక్షన్‌కు మార్చాలంటే కనీసం 3 సంవత్సరాలు తర్వాతానే.. ఈ విషయం సూపరింటెండెంట్ తెలిసిన విషయం.. అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఈ విషయంలో పూర్తి సహకారాలు అందించినట్లు తెలుస్తుంది.. ఇతగాడు గత కొంత కాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినీలతో చెడుగా ప్రవర్తిస్తున్నట్లు, కొంతమందినీ లైంగికంగా వేధిస్తున్నట్లు హైలెవల్ కమిటీ నిర్ధారణ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ దే తప్పుగా తేల్చేశారు. రాష్ట్ర వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈకి రిపోర్ట్ కూడా అందజేశారు.
‘అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు’ అన్నట్టు ఉన్నది సూపరింటెండెంట్ తీరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు అయ్యాయి. మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈ ఆదేశాలు భేఖాతర్ చేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ ఖాన్ పై నేరారోపణ రుజువైంది. వైద్యశాఖ హై లెవల్ కమిటీ నివేదిక మేరకు కామ పిశాచిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్లేట్ల బుర్జు ఆస్పత్రి సూపరింటెండెంట్ కు చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డీఎంఈ అదేశాలు జారీ చేశారు. ఇదీట్లా ఉంటే ఆడవారికి ఆడవారే శత్రువులు అవుతున్నారు. సహ ఉద్యోగినినీ శారీరకంగా వేధించిన షకీల్ హాసన్ పై చర్యలు తీసుకోవాల్సిందిపోయి లైట్ తీసుకున్నారు. అతగాడిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చి నెల రోజులు కావస్తున్న ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసు కోలేదు. కామ పిశాచి ఖాన్ సాబ్ దర్జాగా డ్యూటీ చేస్తూ తిరుగు తున్నాడు. పైగా సూపరింటెండెంట్ నేను మంత్రికి చెప్పుకుం టానంటూ ఏకవచనంలో సంభోదించడంపై మంత్రిగారికి, ప్రభుత్వానికి ఎంతటి విలువను ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఇతగాడికి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డీఎంఈ సైతం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి..
వైద్యశాఖ మంత్రి, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగినులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది…