Sunday, April 13, 2025
spot_img

అభివృద్ది.. వారసత్వం లక్ష్యంగా పయనం

Must Read
  • 2036 ఒలంపిక్స్‌ కోసం భారత్యత్నం
  • విపక్షాలది కుటుంబ రాజకీయం
  • వారికి అభివృద్ది కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం
  • వారణాసిలో పలు అభివృద్ది పనులకు మోడీ శ్రీకారం
  • ఇటీవలి అత్యాచార ఘటనపై అధికారులతో ఆరా

భారత్‌ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో ముందుకువెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని.. అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కాశీ ఎప్పటికీ తనదేనని.. తాను కాశీకి చెందినవాడినని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయని విమర్శించారు. కానీ తమ పార్టీ ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ఇతివృత్తంగా ముందుకుసాగుతోందని అన్నారు. ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఫులే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని అక్కడి వారినుద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్షాలు ’పరివార్‌ కా సాథ్‌ పరివార్‌ కా వికాస్‌’ అనే విధానాన్ని అనుసరిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. కానీ దానికి విరుద్ధంగా తామెప్పుడూ ’సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కూడా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశామని అన్నారు. వాటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, నాలుగు గ్రామీణ రోడ్లు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని ప్రధాని తెలిపారు. గతంలో పూర్వాంచల్‌లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండేవని, కానీ నేడు కాశీ పూర్వాంచల్‌కు ఆరోగ్య రాజధానిగా మారుతోందని ప్రధాని అన్నారు.

70 ఏళ్లు దాటిన ముగ్గురు లబ్ధిదారులకు ఆయష్మాన్‌ కార్డులను అందజేశారు. ఇదిలావుంటే వారణాసిలో చోటుచేసుకున్న దారుణ సామూహిక అత్యాచార ఘటన దిగ్బ్రాంతికి గురిచేసింది. 6 రోజుల్లో 23 మంది వ్యక్తులు.. 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన ఇటీవల వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇది ప్రధాని మోదీ దృష్టికి చేరడంతో ఆయన ఆరా తీశారు. శుక్రవారం వారణాసి కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మోదీ వారణాసిలో పర్యటించిన సందర్భంగా ఇటీవల జరిగిన అత్యాచార ఘటన గురించి జిల్లా మేజిస్టేట్ర్ర్‌, పోలీస్‌ కమిషనర్‌, డివిజినల్‌ కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 29వ తేదీన బాధిత యువతి కొంతమంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సామూహిక అత్యాచారం గురించి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఆ యువతి వెల్లడిరచిన వివరాల ప్రకారం.. కొందరు యువకులు తనను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దర్యాప్తు జరిపిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది.

Latest News

నిరుద్యోగి జీవితం..

ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS