పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా పడింది. బుధవారం సాయింత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ -సీ 59ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగీలోకి పంపాలని శాస్త్రవేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పీఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం సాయింత్రం 4.12 గంటలకు పీఎస్ఎల్వీ -సీ59 నింగీలోకి పంపుతామని తెలిపింది.