తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని,మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే నాకు చాలా ఇష్టమని,ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందని,అయినతో కలిసి పని చేయడం ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రకాశ్ రాజ్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కల్తీ లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని,దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్ట్ పెట్ట అని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ పోస్టును తప్పుగా అర్థం చేసుకోలేదు, అయిన ఉద్దేశం నాకు అర్థమైందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.