సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తెలుగువారు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవ (టీబీడీ) సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ వేడుకలను సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా-సెంట్రల్) నిర్వహిస్తుంది. సంబరాలకు ముందుగా ఏర్పాటుచేసే క్రీడా పోటీల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారతీయ అంతర్జాతీయ పాఠశాల(ఐ.యస్.ఆర్) క్యాంపస్‌లో లేటెస్ట్‌గా నిర్వహించిన పోటీల్లో 400 మంది పాలుపంచుకున్నారు.
విజేతలకు టీబీడీ రోజు (సెప్టెంబర్ 26న) బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. టీబీడీ సెలబ్రేషన్స్‌ను రియాధ్‌లో మూడేళ్ల కిందట ప్రారంభించామని, అవి ఇప్పుడు ఒక మైలురాయిగా మిగిలిపోయాయని సాటా సెంట్రల్ ప్రతినిధులు చెప్పారు. సాటా పేరుతో ప్రారంభించి ప్రస్తుతం సాటా సెంట్రల్‌గా మార్చామని వివరించారు. ఏటా సౌదీ జాతీయ దినోత్సవ సెలవుల సందర్భంగా టీబీడీ నిర్వహిస్తామని, ఈసారీ సెప్టెంబర్ 26నే ఏర్పాటుచేశామని వెల్లడించారు.